Sunday, February 16, 2020

*💥పేరు మార్చుకోవడం ఇలా..*

*💥పేరు మార్చుకోవడం ఇలా..*

♦తల్లి దండ్రులు తమ సంతానానికి పుట్టినప్పుడే నచ్చిన పేర్లు పెడుతుంటారు. పెరిగి పెద్దయ్యాక అమ్మానాన్నలు పెట్టిన పేర్లు నచ్చకపోవడంతో కొందరు, బాగా లేక నవ్వుల పాలవుతున్నామని మరికొందరు పేర్లు మార్చుకునేందుకు ప్రయాస పడుతుంటారు. అధికారికంగా పేరు మార్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల విషయం చాలా మందికి తెలియదు. పేర్లు మార్చుకోలేక తంటాలు పడుతుంటారు. సమాచారార్థం  పేర్ల మార్పుపై వి
వివరన.
 
రాష్ట్రంలో నివసించే వ్యక్తి ఆడ, మగ ఎవరైనా సరే ముందుగా తహసీల్దార్‌కు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవోపీ నెం.619, తేదీ: 08-12-1977 ప్రకారం నిర్ణీత ఫారంతో దరఖాస్తు చేసుకోవాలి.

♦ దరఖాస్తుతో పేరు మార్చుకోవాలన్న కోరికను తెలుపుతూ తనను భారతదేశ పౌరునిగా గుర్తిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేయాలని కోరాలి. ఈ దరఖాస్తు వెంట సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ నుంచి తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేనట్లు ధ్రువీకరణ పత్రం పొంది సమర్పించాలి. దరఖాస్తు అందు కున్న తర్వాత సంబంధిత తహసీల్దార్‌ రెవెన్యూ ఆర్‌ఐ పరిశీలన చేయించి భారత పౌరునిగా గుర్తింపు పొందడానికి అర్హుడై ఉన్నాడని ఒక మెమోరాండం జారీ చేస్తారు. తర్వాత దరఖాస్తుదారు ఆ మెమోరాండం ప్రతిని గెజిట్‌లో ప్రచురించమని దరఖాస్తు చేసుకోవాలి. గెజిట్‌లో ప్రచురితమైన తర్వాత ప్రజలందరికీ తెలిసేలా రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న ఏదేని ప్రముఖ దిన పత్రికలో పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించుకుంటే పేరు మారినట్లు లెక్క. విద్యార్థులైతే ఉన్న సర్టిఫికెట్లను గెజిట్‌, దినపత్రిక ప్రకటనకు జత చేసి సంబంధిత విద్యా విభాగాల్లో పేరు మార్పించుకుని కొత్త పేరుతో సర్టిఫికెట్లు పొందే వీలుంది.
 
*♦ప్రభుత్వ ఉద్యోగులకు ..*
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు కూడా పేరు మార్చుకోవడాన్ని సరళతరం చేసింది. 1985 ఏప్రిల్‌ 24న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వినతిపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవోపి నెం.182 జారీ చేసి ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నవారికి ఈ పేరు మార్చుకునే పద్ధతి రూపొందించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోనవసరం లేదు. రూ.5 నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంపు పేపర్‌ మీద ఒక దస్తావేజుపై పేరు మార్చుకుంటున్నట్లు రాయాలి. ఆ దస్తావేజును రిజిష్టర్‌ చేయాల్సిన అవసరం లేదు. కానీ అటువంటి దస్తావేజును రాసుకున్నట్లు రాష్ట్ర గెజిట్‌లో ప్రచురణకు దరఖాస్తు ఇవ్వాలి. 

♦గెజిట్‌లో ప్రచురితమైన తర్వాత ఏదేని ప్రముఖ దినపత్రికలో పేరు మార్చుకున్నట్లు ప్రకటించుకోవాలి. ఈ లాంఛనాలను పాటించిన తర్వాత ఏదేని ప్రముఖ దినపత్రికలో పేరు మార్చుకున్నట్లు ప్రకటించుకోవాలి. ఈ లాంఛనాలను పాటించిన తర్వాత సంబంధిత దస్తావేజును గెజిట్‌, దినపత్రిక ప్రచురణ ప్రతులతో సంబంధిత శాఖాధికారికి ఆర్జీ పెకట్టుకుంటే సర్వీసు బుక్‌తో పాటు అన్ని ప్రభుత్వ రికార్డులన్నింటిలో పాత పేరు పోయి కొత్త పేరు చోటు చేసుకుంటుంది.

Monday, February 10, 2020

Good Message

🅿 *"విస్తరాకును"* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *'భోజనానికి'* కూర్చుంటాము.
భోజనము తినేవరకు *"ఆకుకు మట్టి"* అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం *'ఆకును' (విస్తరిని)* మడిచి *'దూరంగా'* పడేస్తాం. 
*"మనిషి జీవితం"* కూడా అంతే ఊపిరి పోగానే *"ఊరి బయట"* పారేసి వస్తాము.
*'విస్తరాకు'* పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే *'పొయేముందు ఒకరి ఆకలిని'* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *'తృప్తి'* ఆకుకు ఉంటుంది.
*'విస్తరాకుకు'* ఉన్న ఆలోచన భగవంతుడు *"మనుషులకు"* కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ....
*'సేవ'* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *'సేవ'* చేయండి.
మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *"వాయిదా"* వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే *'కుండ'* ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు *'విస్తరాకుకు'* ఉన్న *'తృప్తి'* కూడా మనకి ఉండదు..
 ఎంత *'సంపాదించి'* ఏమి లాభం? *'ఒక్కపైసా'* కూడా తీసుకుపోగలమా?
 కనీసం  *'మన ఒంటిమీద బట్ట'* కూడా మిగలనివ్వరు..
అందుకే *'ఊపిరి'* ఉన్నంత వరకు *"నలుగురికి"* ఉపయోగపడే విధంగా *'జీవించండి'*..                                        *ఇదే జీవిత పరమార్ధం*💐

Saturday, February 1, 2020

మీకు మీ కుటుంబ సభ్యులందరికి *రధసప్తమి సూర్య జయంతి* శభాకాంక్షలు

🌹🌹ఉషోదయం🌹🌹

శనివారం --: 01-02-2020 :

   *జీవితం* మంటే *వంద* సంవత్సరాల *కాలం* కాదు *వేల* సంవత్సరాల *జ్ఞాపకం* , జ్ఞాపకం అంటే *గతాన్ని* గుర్తు పెటు కోవడం కాదు *ప్రపంచానికి* మనం గుర్తుండేల చేయడం *నేస్తమా ! ...*

   మనం చూపే *మంచితనానికి* ఎప్పటికి *ఓటమి* లేదు ఎవరైనా సరే *చెడుకి* నిలువ *నీడ* కూడా ఉండదు ఇది తెలుసుకుని *బ్రతికితే* మనకూ *సమాజంలో* సరియైనా విలువ ఉంటుంది 

    మనం *ఎదుటివారిలో* తప్పులు *వెతకడమే* పనిగా పెట్టుకుంటే *బంధువులూ స్నేహితులూ* ఎవరూ చివరికి మిగులరు , ఎవరినీ *తప్పు* పట్టవద్దు ఎవరినీ *నిందించవద్దు* ఎవ్వరి *పరిస్థితులు* వారివి , *అర్థం* చేసుకోగలరు అప్పుడే *వాస్తవాలు* తెలిసుకోగలరు , *విలువలు* మారచిపోకు నేస్తమా ...

    *జీవితంలో* మనం ఎవరిని కలవాలో *కాలమేనిర్ణయిస్తుంది* మనం *ఎవరితో* ఉండాలో మన *మనస్సు* నిర్ణయిస్తుంది *మనతో* ఎవరు ఉండాలనేది మన *ప్రవర్తన* నిర్ణయిస్తుంది . 

        *ఇతరులు* మనకు చెప్పిన దాన్ని *ఆచరించడంలోనో* వారిని అనుకరించడంలోనో కాదు *మనం*
 సరైనదని *నమ్మిన* పని చేయడం లోనే *నిజమైన* సంతోషం *మనఃశాంతి* ఉంటుంది .

💟🌳💟🌳💟🌳💟🌳💟🌳💟

Friday, January 24, 2020

పదవ తరగతి పరీక్షలలో 10 G.P.A. సాధించడానికి ఉపయోగపడే అంశాలు.

1. పదవతరగతి పరీక్ష చాలా తేలికైన పరీక్ష. ఒక నెల రోజులు బాగా చదివినా 10 G.P.A. ఆశించవచ్చు.
2. పదవతరగతి పరీక్ష చాలా ముఖ్యం అన్న వాళ్ళ మాట పట్టించుకోకండి. తర్వాత ఇంటర్మీడియట్లో , డిగ్రీలో అలాగే చెప్తారు.
3. ఆరోగ్యం, విశ్రాంతి విషయంలో సాధారణ జాగ్రత్తలు అవసరం. ఆటలు, హాబీలు, ఫోన్ వాడకం కొంచెం తగ్గిస్తే మంచిది.
4. ఒక WhatsApp గ్రూప్ ఏర్పరచుకుని సబ్జెక్టు విషయాలు చర్చించుకోవచ్చు. నోట్సు, సైన్సు చిత్రాలు, గ్రాఫులు, నిర్మాణాలు మ్యాప్లు  తేలికగా మార్పిడి చేసుకోవచ్చు. ఒక ఉపాధ్యాయుడిని Group Admin గా తీసికోండి.
5. మీకు సౌకర్యంగా ఉండే సమయంలో చదవండి. ఎంతసేపు చదివారన్నది ముఖ్యం. ఎప్పుడు చదివారన్నది ముఖ్యం కాదు.
6. సమాధానాలు చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను పెన్సిల్ తో Underline/ highlight చెయ్యండి.
7. ఒక విషయం రెండుసార్లు చదివినా అర్థం కాకపొతే వెంటనే ఉపాధ్యాయుని/ సహవిద్యార్ధిని అడగండి. 
8. నేర్చుకున్న విషయం, పునర్విమర్శ కూడా చేసిన విషయం Tracking System ద్వారా గుర్తించండి. చివర నమూనా ఇయ్యబడినది. 
9. విషయాన్ని బట్టి Mind Map, Concept Map, Flow chart వంటివి తయారు చేసుకోండి. చివర నమూనాలు  ఇయ్యబడినవి. 
10. జ్ఞాపకశక్తికి చిట్కాలు ఉండవు. బాగా నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంటాయి. గుర్తుండట్లేదు అంటే మరొక్కసారి నేర్చుకోండి. ఉపాధ్యాయుల సహాయం తీసికోండి.
11. చదివే విషయం అర్థం కావడానికి, ఆసక్తికి సంబంధం ఉంటుంది. వేరే ఆసక్తికి మార్గాలు ఉండవు. 
12. మీకు ఈపాటికి ప్రశ్నాపత్రం నమూనా, ఏ సెక్షన్లో ప్రశ్నలకి ఎన్ని మార్కులుంటాయి అనేది తెలిసే ఉండాలి. 
13. విద్యాప్రమాణాల ఆధారంగా ఏ సెక్షన్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలిసి ఉండాలి. లేదా బ్లూప్రింట్ గురించి ఉపాధ్యాయులను అడగండి.
14. ప్రశ్నాపత్రం చదవడానికి కనీసం పది నిముషాలు కేటాయించండి. 
15. సమాధానాలు వ్రాయాలనుకున్న ప్రశ్నలను ప్రశ్నాపత్రంలో టిక్ చెయ్యండి. వ్రాసిన తర్వాత ప్రశ్నాపత్రంలో సర్కిల్ చెయ్యండి. 
16. వీలైనంతవరకు ప్రశ్నాపత్రం క్రమంలోనే సమాధానాలు ఉండేట్టు చూసుకోండి. ఎగ్జామినర్ కు వీలుగా ఉంటుంది. 
17. సమాధాన పత్రంలో ప్రశ్న సంఖ్య తప్పనిసరిగా వ్రాయండి. స్కెచ్ పెన్ వాడచ్చు కానీ ఎరుపు/ ఆకుపచ్చ వాడకూడదు. 
18. నాలుగు వైపులా మార్జిన్స్ ఒక స్కెచ్ పెన్ వాడి గీయవచ్చు. ఎక్కువ రంగులు వాడకండి. 
19. గణితంలో రఫ్ వర్క్ చూపించండి. సమాధానాన్ని బాక్స్ లో సూచించండి. 
20. నిర్మాణం ప్రశ్నలో Rough Diagram కు మార్కులు వుంటాయి. 
21. సైన్సులో బొమ్మ గీసిన తర్వాత భాగాలు అక్కడే గుర్తించాలి. సంఖ్య ఇచ్చి భాగం పేరు వేరొక చోట వ్రాయకండి.
22. సోషల్ స్టడీస్ లో కూడా మ్యాప్ ఉన్నచోటే ప్రదేశాన్ని గుర్తించాలి. 
23. ఏ సబ్జెక్టులోనయినా సమాధానాల్ని పాయింట్స్ రూపంలో వ్రాయండి. వ్యాసాలు వంటివి running matter లా వ్రాయాలి.  
24. ఒక ప్రశ్నకు పూర్తి సమాధానం వ్రాయలేకపొతే కొంచెం స్థలం వదలి తరువాత ప్రశ్నకు వెళ్ళండి. ఎక్కువ సమయం ఒకే ప్రశ్న వద్ద ఆగిపోకండి. 
25. ఒక పేజిలో దాదాపు ఇరవై వరకు లైన్లు వస్తాయి. మరీ పెద్దగా లేదా చిన్నగా వ్రాయకండి. 
26. నాలుగు మోడల్ ప్రశ్నాపత్రాల నుండి సమాధానాలు చదవండి. నాలుగు ప్రశ్నాపత్రాలు స్వయంగా ప్రయత్నించండి.

స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:

పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే.

రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.

 నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒకదాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే *జీవితం*.

అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.

మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.

30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది.

మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా..  అందులో తేడా ఏమీ వుండదు.

ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం.

మనం వుండే ఇల్లు మూడొందల  గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే.
నీలోని మనిషికి సంతోషం.. నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు.

నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.

అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం.

జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి:
1. మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.
2. ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.
3. వంద కారణాలు చూపినా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.
4. మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది.
5. వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే.. కలిసి వెళ్లు.

చివరగా, వీటిని గుర్తుంచుకో:
వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం !

నీ జీవితంలోని ప్రతి మలుపులో వీటిని గుర్తుంచుకో !!

(స్వేచ్ఛానువాదం:....)

Sunday, January 12, 2020

చిరునామా ప్రూఫ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 45 రకాల అంశాలను నిర్దేశించింది. వీటిల్లో ఏదైనా ఒకటి సబ్‌మిట్‌ చేయాలి. ఇలా ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చిరునామాలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్ఛు*

🌳🌲®🅰〽💲🌲🌳

*♦ఆధారం లభించింది*
*జనానికి తప్పిన ఇక్కట్లు*
 *కేంద్రానికి వెళ్లకనే చిరునామా మార్పు*
 *వెసులుబాటు కల్పించిన కేంద్రం*

*🔸ఇప్పటివరకు ఆధార్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే అవస్థలే. ఆధార్‌ కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. పరిమిత సంఖ్యలో టోకెన్లు ఇస్తుండటంతో ఇబ్బందులు అన్నీఇన్నీకావు. వీటన్నింటినీ గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అక్కడికి వెళ్లకనే చిరునామా మార్చుకొనేలా వెసులుబాటు కల్పించింది. తగిన ధ్రువపత్రాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసి చిరునామాను మార్చుకునే అవకాశాన్ని కల్పించింది.*

*♦కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి వ్యక్తిగత ఆధార్‌ను 12 అంకెల నంబరుతో కేటాయించడంతోపాటు గుర్తింపు కార్డులను జారీ చేసింది. ఇందులో పేర్లు, చిరునామా, పుట్టిన తేదీ, తండ్రి, భర్త పేరు, ఫోన్‌ నంబరు, మెయిల్‌ తదితర వివరాల మార్పులు, చేర్పుల కోసం ఆధార్‌ కేంద్రాలైన తపాలా, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.*

*🔹పేరు, పుట్టిన తేదీ, ఫోన్‌ నంబరు నమోదు, మార్పులకు తప్పనిసరిగా ఆధార్‌ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్‌ వేయాల్సి ఉంది. పేరులో తప్పులను సరిచేసుకునేందుకు పట్టణ స్థాయిలో గెజిటెడ్‌ అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం సరిపోతుంది. గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి, ఎవరైనా గెజిటెడ్‌ అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. పుట్టిన తేదీని మార్చుకునేందుకుగాను సంబంధిత సర్టిఫికెట్‌, పదో తరగతి పత్రం, గెజిటెడ్‌ అధికారి ఇచ్చిన జనన ధ్రువీకరణ పత్రం.. ఇందులో ఏదో ఒక పత్రం అవసరం. ఆధార్‌ కేంద్రానికి వెళ్లి అర్జీ రాసి బయోమెట్రిక్‌ విధానంతో ఈ వివరాలను నమోదు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువు కాలంలోగా సంబంధిత చిరునామాకు మార్పు చేస్తే ఆధార్‌ కార్డు పోస్టు ద్వారా వస్తుంది.*

*🔸ఆధార్‌లో చిరునామా, తండ్రి, భర్త వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం ఇక ఆధార్‌ కేంద్రానికి వెళ్లకుండా సొంతంగా చేసుకునే వెసులుబాటును భారత ప్రభుత్వం కల్పించింది. వ్యక్తిగత వివరాలు సవరణ చేసుకోదలచినవారు తమ ఆధార్‌కు ఫోన్‌ నంబరు లేదా మెయిల్‌ ఐడీ అనుసంధానం అయి ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ మార్పులకు కూడా ప్రభుత్వం సూచించిన ఫొటో గుర్తింపుతో గల చిరునామా ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి తప్పనిసరి. అంతర్జాలం ద్వారా మార్పు చేసుకునేవారు ఇలా చేయొచ్ఛు*

*🍁ఎలా చేసుకోవాలంటే..*

*🔹https:///uidai.gov.in/ లింక్‌ను వెబ్‌ పేజీలో నమోదు చేయడం ద్వారా యూఐడీఏఐ పేజీ తెరుచుకుంటుంది. తొలుత మై ఆధార్‌పై మౌస్‌ను ఉంచితే మరో మెనూ బార్‌ తెరుచుకుంటుంది. అందులో అప్‌డేట్‌ యువర్‌ ఆధార్‌లో అప్‌డేట్‌ చిరునామాపై క్లిక్‌ చేస్తే మరో పేజీ ఓపన్‌ అవుతుంది. అందులో అప్‌డేట్‌ యువర్‌ అడ్రస్‌ వద్ద క్లిక్‌ చేస్తే ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ అడ్రస్‌ అని వస్తుంది. తర్వాత వచ్చే పేజీలో 12 అంకెల ఆధార్‌ నంబరును నమోదు చేసి సూచించిన వెరిఫికేషన్‌ కోడ్‌ను నమోదు చేయాలి. సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేస్తే గతంలో ఆధార్‌తో లింకైన ఫోన్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసి నెక్ట్స్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే మరో పేజీలో అప్‌డేట్‌ అడ్రస్‌ వయా అడ్రస్‌ ప్రూఫ్‌ ఆప్షన్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే గతంలో ఆధార్‌ కార్డులో ఉన్న చిరునామా వివరాలు ఉంటాయి. దాని కింద మార్చాల్సిన చిరునామా వివరాలు నమోదు చేసి ప్రీవ్యూపై క్లిక్‌ చేయాలి. మనం నమోదు చేసిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని ఈ పేజీలో చూసుకోవచ్ఛు వివరాలన్నీ సక్రమంగా ఉంటే కింద ఇచ్చిన బాక్స్‌పై క్లిక్‌ చేస్తే టిక్‌ మార్కు వస్తుంది. అనంతరం సబ్‌మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి. అప్‌లోడ్‌ ఎ కాపీ ఆఫ్‌ వ్యాలిడ్‌ అడ్రస్‌ ప్రూఫ్‌ అని అడుగుతుంది. అందులో మనం ఏరకమైన ప్రూఫ్‌ అప్‌లోడ్‌ చేస్తున్నామో దానిని ఎంచుకుని అప్‌లోడ్‌ డాక్యుమెంట్‌పై క్లిక్‌ చేయాలి. అందులో స్కాన్‌ చేసిన ప్రూఫ్‌ను అప్‌లోడ్‌ చేసి సబ్‌మిట్‌ చేస్తే, రిసిప్ట్‌ వస్తుంది. నమోదు చేసినట్లు ఫోన్‌కు సందేశం వస్తుంది. వివరాలన్నీ సక్రమంగా ఉంటే సూచించిన గడువులోగా కొత్త కార్డు పోస్టు ద్వారా ఇంటికి వస్తుంది. యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఆధార్‌ పొందవచ్ఛు చిరునామా ప్రూఫ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 45 రకాల అంశాలను నిర్దేశించింది. వీటిల్లో ఏదైనా ఒకటి సబ్‌మిట్‌ చేయాలి. ఇలా ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చిరునామాలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్ఛు*

🍁🍃🍁🍃🍁🍃

Monday, January 6, 2020

Very nice poem about life

Very nice  poem about  life,

     సమయం  గడిచిపోయింది, 
 ఎలా  గడిచిందో తెలియదు, 
జీవితమనే..పెనుగులాటలో..... వయసు  గడిచిపోయింది  తెలియకుండానే.

భుజాలపైకి..ఎక్కే పిల్లలు  భుజాలదాక వచ్చేశారు.
   తెలియనేలేదు..
 
అద్దె ఇంటి నుండి  చిన్న గా మొదలైన  జీవితం. 
ఎప్పుడు  మన ఇంట్లో కి వచ్చామో తెలియదు

ఆయాసంతో   సైకిల్  పెడల్ కొడుతూ..కొడుతూ..
కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో తెలియదు

ఒకప్పుడు  తల్లిదండ్రుల బాధ్యత  మాది.
కానీ 
ఇప్పుడు  నాపిల్లలకు  నేను బాధ్యత గా మారాను 
ఇది కూడా  ఎలా  జరిగిందో  తెలియదు. .

ఒకప్పుడు   పగలు  కూడా  హాయిగా  నిద్ర పోయే వారం..
కానీ..
ఇప్పుడు  నిద్ర రాని  రాత్రులు  ఎన్నో..
ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు. 

ఒకప్పుడు  నల్లని కురులనుచూసుకొని  గర్వంగా  వగలు పోయే వాళ్ళం..
అవన్నీ  ఎప్పుడు  తెల్లగా  మారాయో తెలియదు. 

  ఉద్యోగం  కోసం  తిరిగి  తిరిగి  ..
    ఎప్పుడు  రిటైర్  అయ్యామో..
తెలియనేలేదు.

పిల్లల కోసం  ప్రతిదీ  అని ఎంత తాపత్రయం  పడ్డామో..
వాళ్ళు  ఎప్పుడు  దూరంగా  వెళ్లి పోయారో తెలియదు. 

రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల  మధ్య  గర్వంగా  నడిచే వాడిని  ఎప్పుడు  అందరూ...దూరమయ్యారో తెలియదు. 

ఇప్పుడే   ఆలోచిస్తున్నాను..నా కోసం..నా శరీరం  కోసం   ఏమైనా  చేసుకోవాలని..
కానీ..
శరీరం  సహకరించడం లేదు. 

    ఇవన్నీ..జారిపోయాయి..
కానీ  కాలం  ఎలా  గడిచిందో..తెలియనేలేదు. 

It's  truth  of life.

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL
TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top