భవనాల ఎంపికకు శ్రీకారం చుట్టిన అధికారులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 67 మైనారిటీ రెసిడెన్షి యల్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయ్యింది. 10 జిల్లాల్లో 60 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిందే. కగా కొత్తగా మరో 7 రెసిడెన్షియల్ పాఠశాలల ప్రతిపాదనకు కూడ మఖ్యమంత్రి తాజాగా ఆమోదం తెలుపడంతో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ సంఖ్య 67కు పెరిగింది. 67 పాఠశాలల్లో 30 బాలికలకు కేటాయించడం జరిగింది. 2016-17 విద్యా సంవత్సరం నుడి ఇవి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు సంబంధించి భవనాల ఎంపిక, మౌలిక వసతుల కల్పన, విద్యార్థులను చేర్చుకునేందుకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా అద్దెభవనాల్లో వీటిని ప్రారంభిస్తున్నారు. అనంతరం రెండు మూడేళ్ళలో సొంత భవనాలను నిర్మించి అందులోకి తరలించడం జరుగుతుంది. మైనారిటీ విద్యార్థుల్లో డ్రాపౌట్స్‌ను అరికట్టి ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మైనారిటీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎనిస్టిట్యూషన్ సొసైటి ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల వారిగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో 7 రెసిడెన్షియల్ పాఠవాలలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో 4 బాలురకు కాగా 3 బాలికలకు కేటాయించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 5 రెసిడెన్షి యల్ స్కూల్స్‌లో రెండు బాలికలు కేటాయిం చారు. కరీంనగర్ జిల్లాలో 8 స్కూల్స్‌ను ప్రారంభిస్తుండగా బాలికలకు 4 కేటాయించడం జరిగింది. 5 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్న ఖమ్మం జిల్లాలో రెండు బాలికల కోసం కేటాయించడం జరిగింది. మెదక్ జిల్లాలో 9 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బాలికల కోసం నాలుగు కేటాయించడం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 7 పాఠశాలలను ప్రారంభిస్తుండగా అందులో 3 బాలికలకు కేటాయించారు. హైదరాబాద్ జిల్లాలో 8 రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాలుగు బాలికలకు కేటాయించారు. రంగారెడ్డి జిల్లాలో 9 పాఠశాలలను ప్రారంభిస్తుండగా బాలికలకు నాలుగు, బాలురకు 5 కేటాయించడం జరిగింది. నల్గొండ జిల్లాలో 5 రెసిడెన్షియల్ స్కూల్స్‌కు గాను బాలికలకు 2 కెటాయించడం జరిగింది. వరంగల్ జిల్లాలో నాలుగు స్కూల్స్‌కు గాను రెండు బాలికలకోసం ప్రారంభిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్‌లో బాలురు, బాలికల కోసం ఒక్కొక్కటి, నిర్మల్ (బాలికలకు), భైంసా (బాలురకు), కాగజ్‌నగర్ (బాలికలకు), మంచిర్యాల్ (బాలురు), ఖానాపూర్ (బాలురు), నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ (బాలికలు), బోధన్ (బాలికలు), ఆర్మూర్ (బాలురు), భాన్స్‌వాడ (బాలురు), యెల్లారెడ్డి (బాలురు), కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పట్టణంలో బాలురు, బాలికల కోసం చెరొకటి, రామగుండం (బాలురు), జగిత్యాల్ (బాలికలు), కోరుట్ల (బాలురు), పెద్దపల్లి (బాలికలు), సిరిసిల్లా (బాలికలు), హుజూరాబాద్ (బాలురు), ఖమ్మం జిల్లాలోని ఖమ్మంలో బాలురు, బాలికల కోసం ఒక్కొక్కటి చొప్పున, కొత్తగూడం (బాలికలు), యెల్లెందు (బాలురు), సత్తుపల్లి (బాలురు), మెదక్ జిల్లాలోని సంగారెడ్డి (బాలికలు), సిద్దిపేట (బాలురు), సదాసివపేట (బాలికలు), పటాంచెరు (బాలురు), మెదక్ (బాలురు), నారాయణ్‌ఖేడ్ (బాలికలు), గజ్వేల్ (బాలికలు), ఆందోల్ (బాలురు), నర్సాపూర్ (బాలురు), మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్ (బాలురు), గద్వాల్ (బాలికలు), జడ్చర్ల (బాలురు), ఫరూక్నగర్ (బాలికలు), నారాయణ్‌పేట్ (బాలురు), కల్వకుర్తి (బాలికలు), అచ్చంపేట్ (బాలురు), హైదరాబాద్ జిల్లాలోని బహాదుర్ పురా బాలురు, బాలికల కోసం ఒక్కొక్కటి, ఆసిఫ్‌నగర్ (బాలురు), చార్మినార్ (బాలికలు), సైదాబాద్ (బాలురు), గోల్కొండ (బాలికలు), ముషీరాబాద్ (బాలికలు), సికిందరాబాద్ కంటోన్మెంట్ (బాలురు), రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ (బాలికలు), బాలానగర్ (బాలురు), కుత్బుల్లాపూర్ (బాలురు), మల్కాజ్గిరి (బాలికలు), శేరిలింగంపల్లి (బాలురు), ఉప్పల్ (బాలికలు), తాండూర్ (బాలికలు), వికారాబాద్ (బాలురు), పర్గి (బాలురు), నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ (బాలికలు), కోదాడ (బాలురు), సూర్యాపేట్ (బాలురు), భోన్గిర్ (బాలికలు), దేవరకొండ (బాలురు), వరంగల్ జిల్లాలోని వరంగల్ (బాలికలు), మహబూబాబాద్ (బాలురు), జన్గావ్ (బాలికలు), హనమ్‌కొండ (బాలురు) కోసం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తున్నారు.