Saturday, February 20, 2016

దుబ్బాకకు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు

-రూ. 18.31 కోట్లకు పరిపాలనా అనుమతులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు మెదక్ జిల్లా దుబ్బాకకు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2016-17 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం రూ. 18.31 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. ఇందులో రూ. 15.16 కోట్లు స్కూల్ భవనం, మౌలిక సదుపాయాల కల్పనకు, మిగిలిన రూ. 3.15 కోట్లు రికరింగ్ ఖర్చు కింద వాడుకోవాలని పేర్కొంది. స్కూల్‌కు అవసరమైన టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది భర్తీకి సంబంధించి ఫైనాన్స్ శాఖ వేరుగా ఉత్తర్వులు జారీచేస్తుందని ఎస్సీ శాఖ సెక్రటరీ మహేశ్‌దత్ వెల్లడించారు.

SCIENCE VIDEOS


MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES