Search This Blog

Tuesday, March 1, 2016

రూ.2వేల నుంచి 5వేలకు పన్ను రాయితీ పెంపు

రూ.2వేల నుంచి 5వేలకు పన్ను రాయితీ పెంపు

దిల్లీ: కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ  సోమ‌వారం లోక్‌స‌భ‌లో 2016-17 సంవ‌త్స‌రానికి సంబంధించిన ‌బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆదాయ‌ప‌న్నుల్లో ప్ర‌ధానంగా ఎలాంటి మార్పులు లేవ‌ని వెల్ల‌డించారు. 
* రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ-రిటర్న్‌ దాఖలు చేస్తే ఇప్పటి వరకు రూ.2వేలు రాయితీ పొందేవారు. ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ.5వేలకు పెంచారు. 
* పన్ను రాయితీ ద్వారా కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం 
* 3.5 కోట్ల చౌకధరల దుకాణాల డిజిటలైజేషన్‌ 
* స్టార్టప్‌ కంపెనీల రిజిస్ట్రేషన్‌కు ఒక్కరోజులోనే అనుమతి 
* అద్దె ఇళ్లల్లో నివాసం ఉండేవారికి అద్దె మినహాయింపు రూ.24వేల నుంచి రూ.60వేలకు పెంపు. సొంత ఇల్లు లేని, హెచ్‌ఆర్‌ఏ పొందని ఉద్యోగులకు వర్తింపు 
* స్టార్టప్‌ల ద్వారా పొందే లాభాలపై మూడేళ్ల పాటు నూరు శాతం పన్ను రాయితీ

SCIENCE VIDEOS

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES