Sunday, July 9, 2017

ప్రభుత్వోద్యోగుల పాలసీ* *"TSGLI"*

.

*(ఇది సొసైటి ఉద్యోగులకు వర్తిస్తుందా లేదా*
           *తెలుసుకొనవలెను)*
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -

       *ప్రభుత్వోద్యోగుల  పాలసీ*
            *"TSGLI"*

*LIC, PLI ల కంటే TSGLI మంచిదని  చాలా మందికి తెలియదు. LIC, PLI ల గురించి ఏజెంట్లు వివరిస్తారు కాబట్టి వాటి గురించి కొంత అవగాహన ఉంటుంది. కానీ TSGLI గురించి మనకు ఎవరూ చెప్పరు,*
*ఏదో TSGLI మంచిది అంటారు కాని దాని గురించిన పూర్తి సమాచారం తెలియదు మనకి.
ఇప్పడు నేను TSGLI గురించి నాకు తెలిసింది మీకు వివరిస్తాను.*
*ఉదాహరణకు మనం 2010 లో బర్తీ అయినప్పుడు మన TSGLI చందా 350/- ఉండేది, దానికి అందరికీ 'A' బాండ్ వచ్చింది,  2015 PRC తో జీతం పెరగ్గానే ఇంకో 300/- పెరిగి చందా 650/- అయ్యింది. పెరిగిన 300/- ల కి 'B' బాండ్ వచ్చింది. కొందరికి ఇంకా రాలేదు. ఇంకొందరు అయితే బాండ్ కోసం దరఖాస్తు కూడా పెట్టి ఉండరు, దరఖాస్తు పెట్టాలనే విషయం కూడా కొందరికి తెలియదు. కొందరు TSGLI గురించి అవగాహన ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చందాను పెంచుకున్నారు. దానికి పెరిగిన మొత్తానికి మళ్ళీ బాండ్ లు వస్తాయి.  ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను.*
*ఎప్పుడైతే మనం TSGLI అమౌంట్ ని పెంచుకుంటామో... అది జీతంలో కట్ అయి పే స్లిప్ రాగానే వెంటనే ప్రపోసల్ ఫామ్ తీసుకుని దరఖాస్తు చేయాలి. అది ఎందుకో ఒక ఉదాహరణ చెప్తాను.
మన తోటి ఉద్యోగి కానిస్టేబుల్ ఒకతను... అందరూ TSGLI మంచిది అని చెప్తే తన చందా 350/- కి 2650/- కలిపి 3000/- చేశాడు. కానీ బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేయాలనే విషయం అతనికి తెలియదు, ఎవరూ చెప్పలేదు. అలా రెండున్నర సం"లు గడిచిపోయాయి, దురదృష్టం వల్ల అతను ప్రమాదంలో మరణించాడు.* *మరణానంతరం అతనికి రావాల్సిన అన్ని బెనిపిట్స్ తో పాటు TSGLI బెనిపిట్స్ కూడా వచ్చాయి, కానీ 300 రూ"ల ఒక 'A' బాండ్ బెనిపిట్స్ మరియు మాత్రమే వచ్చాయి, 2650 రూ"ల బెనిపిట్స్ రాలేదు. ఎందుకంటే అతను 'B' బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు కాబట్టి. నెల నెలా 2650రూ"లు అతని జీతం నుండి కట్ అయి అతని TSGLI ఖాతాలో కలిసాయి. కానీ 'B' బాండ్ కోసం దరఖాస్తు చేయకపోవడం వల్ల 2650 రూ"ల 'B' బాండ్ బెనిపిట్స్ రాలేదు, నెల నెలా కట్ అయిన 2650 రూ"ల రెండున్నర సం"ల మొత్తాన్ని వాపసు చేశారు. అతను 'B' బాండ్ కి దరఖాస్తుకు చేయకపోవడం వల్ల అతని కుటుంబం ఎన్ని లక్షల డబ్బులను కోల్పోయిందో నేను మీకు తర్వాత వివరిస్తాను.*

*TSGLI పాలసీలో.... ఉద్యోగి యొక్క వయస్సుని బట్టి అతను కట్టే ప్రీమియంకు రేటు నిర్ణయిస్తుంది ప్రభుత్వం.*
*అంటే... 21 సం"ల వయస్సు నుండి 53 సం"ల వయస్సు వరకు(53 సం"ల వయస్సు తర్వాత TSGLI చేయరాదు)ఈ వయస్సుకు ఇన్ని రూ"లు అని మనం కట్టే ప్రీమియం రూ"లను బట్టి మనకు బాండ్ వాల్యూ నిర్ణయించబడుతుంది. కింద చెప్పేది జాగ్రత్తగా చదివి అర్థం చేస్కోండి. ఇప్పడు నా వయస్సు ఉదా: 29 సం"లు. నేను 4000 రూ"ల ప్రీమియం కడితే నేను కట్టిన ఒక్కోరూపాయికి ప్రభుత్వం 329 రూపాయల 50 పైసలు ఇస్తుంది. అంటే 4000x329.50=13,18,000 రూ"లు. అక్షరాల 13 లక్షల 18 వేల రూ"లు నా బాండ్ వాల్యూ.*
*29 సం"ల వయసున్న నాకు ఇంకా 29 సం"ల సర్వీసు ఉంది, ఈ సర్వీసు కాలం 29 సం"లకు నా బాండ్ వాల్యూ 1318000 రూ"లకు సంవత్సరానికి 10% బోనస్ ఇస్తుంది. అంటే 1318000X290%=3822200/- అక్షరాల 38 లక్షల 22 వేల 200 రూ"లు నా పదవీ విరమణ సమయంలో బోనస్ గా వస్తుంది. మరియు బాండ్ వాల్యూ+బోనస్ కలిపి అంటే* *1318000+3822200=5140200/- అక్షరాలా 51 లక్షల 40 వేల 200 రూ"ల వరకు(కొంచం అటూ ఇటూ గా) నేను నా పదవీ విరమణ సమయంలో తీసుకుంటాను.*
ఇది మీరు నమ్మగలరా....?
*నేను కట్టే నెల నెలా 4000 లు 29 సం"లకి 13,92,000 మాత్రమే... కానీ నేను నా 58 సం"ల వయస్సలో అరకోటి పైగా తీస్కుంటాను. LIC కాదు, PLI కాదు ఏ భీమా కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తం ఇవ్వదు ఒక TSGLI మాత్రమే ఇస్తుందని ఘంటాపథంగా చెప్పగలను. ఇది నిజం,* *ఎందుకంటే... వేరే భీమా కంపెనీలు వాళ్ళ వేల మంది ఉద్యోగులకు జీతాలివ్వాలి, ఏజెంట్లకు కమీషన్ లు ఇవ్వాలి, అవన్నీ ఎక్కడి నుండి ఇస్తాయి మనం కట్టే డబ్బుల నుండే కదా.... మళ్ళీ లాభాలు రావాలి.*
*TSGLI ప్రభుత్వాదినిది, దీంట్లో వచ్చే లాభాలు ఎవరూ పంచుకోరు, ప్రభుత్వం దీని నుండి రాబడి ఆశించదు. అందువల్ల మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది*.

*మరణించిన మన తోటి ఉద్యోగి కానిస్టేబుల్  అతని 25 సం"ల వయస్సులో 2650/- కి అతని చందా పెంచి, 'B' బాండ్ కి దరఖాస్తు చేయక, 28 సం"ల వయస్సులో అతను మరణించడం వల్ల  అతని కుటుంబం కోల్పోయిన మొత్తం రెండున్నర సం"ల బోనస్ తో కలిపి ఎంతో తెలుసా....?*
*అక్షరాలా 12 లక్షల 38 వేల 610 రూ"లు. ఇది ఎవరూ ఆర్చలేని, తీర్చలేని నష్టం*.
*అతను తెలియక చేసిన తప్పును మనం ఎవరమూ చేయకూడదు.*
*ఇప్పుడు నేను, వయస్సుల వారిగా.... మనం కట్టే రూపాయికి ప్రభుత్వం ఇచ్చే వెలను కింద ఇస్తాను. మీరు బాగా అలోచించి TSGLI చందాను మీ సామర్థ్యాన్ని బట్టి ఎంత పెంచాలో నిర్ణయించుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళండి*
*Age*     -     *Rate*
25        -     389.50
26        -     374.10
27        -     359 
28        -     344.10
29        -     329.50
30        -     315.10
31        -     301
32        -     287.20
33        -     273.60
34        -     260.30
35        -     247.30

*చూడండి బ్రదర్స్... వయస్సు పెరిగినా కొద్దీ.... ప్రభుత్వం ఇచ్చే వెల తగ్గుతూ వచ్చింది కదా... ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషికి రిస్క్ పెరుగుతుంది. అందుకని ఏ జీవిత భీమా కంపెనీ అయినా వయస్సును బట్టి పాలసీని నిర్ణయిస్తాయి.*
*తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి లేదంటే యవ్వనంలో చేసిన TSGLI బీమా పాలసీలైనా ఉండాలి* అని.
*చిన్న వయస్సులోనే పాలసీ చేస్తే  చాలా ఎక్కువ భీమా అమౌంట్ మనకు వస్తుంది. అందుకని ఆలస్యం చేయకండి.*
*సమయం లేదు మిత్రులారా.... పెంచని వాళ్ళు పెంచండి, పెంచిన వాళ్ళు బాండ్ లకి దరఖాస్తు చేయండి.*
*ఈ సమాచారాన్ని అన్ని బ్యాచ్ ల తమ్ముళ్ళకి తెలియజేసి వాళ్ళతో  TSGLI అమౌంట్ పెంచుకోమని చెప్పండి. అలాగే సీనియర్స్ కి కూడా తెలియజేయండి.*
          *  *  *  *  *  *

Congratulations to our Honorable Secretary Dr.RS Praveen kumar,IPS For his promotion to Additional DGP rank.

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES