Sunday, July 9, 2017

అర్ధవేతన సెలవులు* *(HALF PAY LEAVES)*

.

                   *అర్ధవేతన సెలవులు*

             *(HALF PAY LEAVES)*

💎 ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.

💎 సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.
సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు.
*(G.O.Ms.No.165 Dt:17-08-1967)*

💎 ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు.

💎 అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.

💎 అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.
1⃣ వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)

2⃣ స్వంత వ్యవహారాలపై (Private Affairs)

💎 సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.

💎 ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.

💎 వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను *కమ్యూటెడ్ సెలవు* అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.
*{APLR 15(B) & 18(B}*

💎 కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచనైనది.
*(G.O.Ms.No.186 Dt:23-07-1975)*

💎 సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు *{Rule 15(B}*

💎 ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.

💎 వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.

💎 వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో
వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.
*(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)*
*(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)*

💎 అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడవు.

💎 క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.
*(G.O.Ms.No.386 Dt:06-09-1996)*
*(G.O.Ms.No.449 Dt:19-10-1976)*

💎 వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు.
*(G.O.Ms.No.29 Dt:09-03-2011)*

💎 ఎట్టి పరిస్థితులలోనూ *కమ్యూటెడ్ సెలవును* HPL గా మార్చుకొనుటకు వీలులేదు.
*(G.O.Ms.No.143 Dt:01-06-1968)*

💎 ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

💎 సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.
*(G.O.Ms.No.33 F&P Dt:29-01-197.

*(ఇంకా కొంత కాలం వరకు వీటిని AP Leave Rules అంటారు)*
.

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top