Tuesday, December 26, 2017

సృజనాత్మక పూలు చిగురింపచేసిన మా మాష్టారు.

*🏹1,2,3లతో రాయగలిగిన అతిచిన్నసంఖ్య 123కాదు 1ఘాతం 23అని సృజనాత్మక పూలు చిగురింపచేసిన మా మాష్టారు..*

*🤝సహజసంఖ్యలతో సహవాసం చేస్తూ..*
*🙇🏻అకరణీయసంఖ్యలతో ఆలోచింపచేస్తూ..*
*👊కరణీయ సంఖ్యలతో రణమాడుతూ..*
*👨🏻‍🏫వాస్తవసంఖ్యలతో వాస్తవికత జోడిస్తూ.. భోధించే గణాపాఠి మా మాష్టారు..*

*🙌మనుషులంతా ఈక్వల్ అనీ..*
*🤘తెలివిలో ఏ ఒక్కరూ ఇంకొకరికి లెస్ దాన్ కారనీ..*
*🤞🏻ఆదర్శాలలో ఎవరూ ఇంకొకరికి గ్రేటర్ దాన్ అవ్వరనీ.. బతుకుపాఠం నేర్పిన అనుభవశాలి మా మాష్టారు..*

*🤷🏻‍♂గణితానికి మీరేమిచ్చారు అంటే నల్ సెట్ అనీ..*
*🕺🏻గణితం మీకేమిచ్చింది అంటే యూనివర్సల్ సెట్ అని చిరునవ్వులు చిందించే భోళాశంకరుడు మా మాష్టారు..*

*🙆🏻గణితానికి మీరిచ్చే ప్రశ్నలు ఏంటీ.. అంటే సబ్ సెట్ అనీ..*
*🙆🏻‍♂గణితం మీకిచ్చే కాన్సెప్ట్ ఏంటీ..అంటే సూపర్ సెట్ అనీ..*
*సూపర్ గా చెప్పే మా మంచి మాష్టారు..*

*🤝స్నేహం చేసేముందు ఇంటర్ సెక్షన్ ని చూడమని..*
*✊శత్రువులని మాత్రం యూనియన్ లా కలుపుకోమని    తెలివి నేర్పిన మితవాది మా మాష్టారు..*

*😡కోపం వస్తే ఎప్సిలానంత చూపమనీ..*
*😘ప్రేమని మాత్రం మ్యూ అంత చాటమనే..ప్రేమామృత మూర్తి మా మాష్టారు..*

*🙏మీరు గొప్పవారూ.. అంటే మనమంతా సర్వసమానమనీ...*
*💁🏻‍♂ఈఆలోచనలెలా వస్తున్నాయి అంటే మనమంతా సిమిలర్ అనీ లవ్లీ గా చెప్పే లవబుల్ మా మాష్టారు..*

*💑భార్యాభర్తలు క్రమయుగ్మాల్లా...*
*👓బంధువులంతా బ్రేసెస్ లా కలిసుండాలనీ..*
*👨‍👨‍👧‍👧పిల్లలంతా నిరూపకతలంలో బిందువుల్లా..*
*👵🏼👴🏻పెద్దవారిని X,Y అక్షాలుగా చూసుకోమని సమాజాన్ని సమయస్ఫూర్తితో ప్రతిబింబించే మామంచి మాష్టారూ...*

*🎹ఆచరణలో బ్రార్ గాఫ్ లా  ఎప్పుడూ ఎత్తులో ఉండమనీ..*
*🔮తోటివారితో పైగ్రాఫ్ లో సెక్టార్ ల లా పక్కన పక్కనే ఉండమనీ..చెప్పే మా మంచి మాష్టారు..*

*😇పేరులోనే వంకరుంది అంటే  గణితంలోనే వక్రముంది..*
*📀దాన్ని వృత్తం చేయడం లేదా రేఖని చేయడం మనచేతుల్లోనే ఉందనీ..మమ్మల్ని తన చుట్టూ సర్కిల్ లా తిప్పుతూ...రివ్వున ఎగిరే గువ్వలా...నవ్వుతూ చెప్పే మా మంచి మాష్టారు..*

*🤠రిటైరయ్యాక ఏం చేస్తారూ అంటే ...*
*😳నేనెప్పుడు రిటైరయ్యానని మమ్మల్నే ఎదురు ప్రశ్నించే నవ వసంతం మా మాష్టారు..*

*😱మీరు గణితానికి చేస్తున్న సేవకు..మా మెదళ్ళకు పెడుతున్న  పదును కు ఏమిచ్చి రుణం తీర్చుకోమూ..!*

*😀గణితాలోచనలో మీ గుండెంట ఉండి తప్పా..*
*మీ గుండె నిండా గణితమే ఉంది..*
*మీమెక్కడున్నామో అర్థం కాట్లేదు..*

*😤కాని మీ వేడిశ్వాస తగులుతుంది అంటే మీ ఊపిరిలోనే ఉన్నామేమో ....*

🙏............................ గారికి ....

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES