Monday, February 5, 2018

గురుతర మార్గదర్శకులు మీరే.. * *ఉపాధ్యాయులు-విద్యార్థుల బంధం ప్రత్యేకమైనది*    *పాఠ్యాంశాలకు మించిన విజ్ఞానాన్ని వారికి నేర్పాలి*    *ప్రధాని రాసిన పుస్తకంలో ఉపాధ్యాయులకు విడిగా లేఖ* 

*గురుతర మార్గదర్శకులు మీరే.. *
*ఉపాధ్యాయులు-విద్యార్థుల బంధం ప్రత్యేకమైనది* 
  *పాఠ్యాంశాలకు మించిన విజ్ఞానాన్ని వారికి నేర్పాలి* 
  *ప్రధాని రాసిన పుస్తకంలో ఉపాధ్యాయులకు విడిగా లేఖ* 

👉పరీక్షల్లో ఒత్తిడిని అధిగమిస్తూ.. విద్యార్థులు తమ ఉజ్వల భవితకు ఎలా బాటలు వేసుకోవాలో వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ (పరీక్ష యోధులు) పుస్తకం శనివారం విడుదలైంది. ప్రస్తుతానికి ఆంగ్లంలో ముద్రితం కాగా.. త్వరలోనే అనేక ఇతర భాషల్లోనూ దీన్ని విడుదల చేయనున్నారు. ఇది ప్రధాని మోదీ మస్తిష్కంలోంచి వచ్చిన ఆలోచన. నెలనెలా నిర్వహిస్తున్న ‘మన్‌ కీ బాత్‌’కి వస్తున్న అనూహ్య స్పందనే ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ. ప్రసంగాల్లా కాకుండా.. అనుసరణీయంగాను.. ఆలోచనలను ప్రేరేపించేలా ఈ పుస్తకం ఉంటుందని ప్రచురణకర్తలు హామీ ఇస్తున్నారు. ఇందులో పిల్లల బంగారు భవితకు బాటలు వేయాలని కోరుతూ ఉపాధ్యాయులకు ప్రధాని లేఖ రాశారు.

ఎన్నికలంటే మోదీకి భయం లేదు... సుష్మా:ఎన్నికలంటే ప్రధాని మోదీకి ఎన్నడూ భయం లేదనీ, అదే రీతిలో పరీక్షలంటే విద్యార్థులూ భయపడకూడదని విదేశీవ్యవహారాలమంత్రి సుష్మా స్వరాజ్‌ చెప్పారు. మోదీ రచించిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పుస్తకాన్ని స్వరాజ్‌, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌లు శనివారం ఆవిష్కరించారు. పుస్తకాలు ఆసక్తికరంగా, చిన్నవిగా ఉండాలనీ, దానిని దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం ప్రధాని ఈ పుస్తకాన్ని రాశారనీ సుష్మా చెప్పారు. ఒక దేశాధినేత రాజకీయేతర అంశంపై పుస్తకం రచించడం ఇదే ప్రథమమని జావడేకర్‌ చెప్పారు. జీవితాన్ని నిర్ణయించేవి మార్కులొక్కటే కాదన్నారు. ప్రజలంతా మోదీ...మోదీ... అని ఎందుకు నినదిస్తారో ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత తెలుస్తుందని చెప్పారు. ఈ పుస్తకం *ఆన్‌లైన్‌లో రూ.100కి లభ్యం కానుంది.*

*ప్రియమైన ఉపాధ్యాయులకు!* 
యువ మేధస్సును చైతన్యశీలం చేస్తూ.. విద్యార్థులను తీర్చిదిద్దుతున్న అద్భుతమైన వృత్తిలో ఉన్న మీ అందరికీ అభినందనలతో ఈ లేఖను ప్రారంభిస్తున్నాను. మీరంతా మన సమాజంలోని మహనీయమైన వృత్తిలో ఉన్నారు. మెరుగైన రేపటి కోసం మీ శ్రమ పునాదులు వేస్తుంది. ఉపాధ్యాయులు-విద్యార్థుల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. విద్యార్థులంతా ఉపాధ్యాయుల పట్ల విధేయతతో.. వారి బాటనే అనుసరిస్తుంటారు. అందుకే ఈ పుస్తకంలోని ఆలోచనలను మీ విద్యార్థులకు తెలపాల్సిందిగా కోరుతున్నాను. మన పరీక్ష యోధులకు అండగా నిలవడం, ప్రోత్సహించడంలో మీ కృషి ప్రాణాధారమన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరీక్షల కోణంలో కొందరు విద్యార్థులు ఆందోళన చెందుతూ ఒత్తిడిని పెంచుకుంటుంటారు. ఇలాంటి ఒత్తిళ్లను జయించేలా మీరంతా వారిని నిత్యం మార్గదర్శనం చేస్తుంటారని నాకు తెలుసు. ప్రతి విద్యార్థికీ అనేకమైన బలాలుంటాయి. వాటికి అనుగుణంగా ఉత్తమ ప్రతిభను వెలికితీసే గురుతర పాత్ర మీది. మీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లోని అంశాలే కాకుండా అంతకుమించిన విజ్ఞానాన్నీ నేర్పండి. స్వతహాగా.. మూలాల్లోంచి ఆలోచించగలిగేలా వారిని తీర్చిదిద్దండి. విజ్ఞాన జిజ్ఞాస, తెలుసుకోవాలన్న తపన, సృజనాత్మక భావనలను పెంపొందించండి. పరీక్షల తర్వాత ఎలాంటి కోర్సుల్లో చేరాలి? ఏయే కళాశాలలను ఎంచుకోవాలి? అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఎక్కడైతే విద్యార్థుల సామర్ధ్యాలను గుర్తించి, అందుబాటులోని అవకాశాలపై బోధన సిబ్బంది మార్గదర్శనం చేస్తున్నారో.. అలాంటి అనేక పాఠశాలలు ఆదర్శనీయ విధానాలను రూపొందిస్తున్నాయి. ఉపాధ్యాయులు కూడా ఉన్నత చదువులకు గాను విద్యార్థుల ఆసక్తులకు తగిన విద్యాసంస్థలను ఎంచుకోగలిగేలా సహకరిస్తున్నారు. ఈమేరకు వారంతా సొంతంగా అవకాశాలను సృష్టించుకుంటూ సాధికారితను సాధించేలా తోడ్పాటునందిస్తారని ఆశిస్తున్నాను. పిల్లలంతా వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. సమున్నతంగా ఎదిగేలా చైతన్యం నింపండి. నేటి ప్రపంచంలో యువత సాధించడానికి అపారమైన అవకాశాలున్నాయి. ఈ పుస్తకంలో అనేక అంశాలున్నాయి. ఈమేరకు విద్యార్థులు ఒత్తిడి, భారం, ఆందోళన లేకుండా పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో.. మార్కులని కాకుండా అవసరమైన విజ్ఞానాన్ని ఎలా సముపార్జించాలో.. నిత్యం మీరు వారితో చర్చిస్తుండాలని కోరుతున్నాను. మీ నిరంతర కృషికి నా శుభాకాంక్షలు.- మీ, 
నరేంద్ర మోదీ

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES