Sunday, February 11, 2018

మీ కుటుంబమైనా మీవల్ల ఆనందంగా ఉండెటట్లు చూసుకోవలిసింది ఖచ్చితంగా మీరే!

18 సంవత్సరాలు పైబడిన వారు చదివితే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే
వారికే ఇది బాగా అర్థం అవుతుంది......తెలుసుకోవాలి కూడా......
దయచేసి చదవండి............ఆనందంగా జీవించడం ఎలానో తెలుసుకుంటే మంచిదని
నా ఆభిప్రాయం.......

ఉదయం 6 గంటల సమయం.......ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం
చేస్తున్నాను. కానీ......లేవలేకపోతున్నాను.. ఎందుకో ఏమిటో మరి......
" ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను ? " ఒక్క నిమిషం ఆలోచించాను.
నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత
నొప్పి వచ్చింది...స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు
తెలియదు.....
కాఫీ కావాలి నాకు........నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.
ఆఫీసుకు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?
వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు.......ఇంటి బయట చాలా మంది గుంపుగా
ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు......అయ్యో! అది నేనే! దేవుడా!
నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు.....బిగ్గరగా
పిలిచాను........నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి
నా పక్కగదిలోకి తొంగి చూశాను.... నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.
కొడుకును పట్టుకుని.......భార్యను పిలిచాను........తనకు నా మాటలు
వినిపించలేదు........మరో గదిలోకి వెళ్ళి చూశాను......
ఆ గదిలో మా అమ్మ ...నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు
దు;ఖంలో.......
" నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను " అని బిగ్గరగా అరిచాను.......ఎవ్వరూ నన్ను
చూడటం లేదు..
బయటికి పరుగెత్తి వచ్చాను.......అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా
ఏడుస్తున్నాడు.....వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు.......
నా స్నేహితునితో నాకు గొడవవచ్చి...........వాడితో సంవత్సరం నుండి నేను
మాట్లాడ్టం మానేశాను.......ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు.మరి
వాడెందుకు ఏడుస్తున్నాడు.........అవును నేను చనిపోయాను......నిజంగానే
చనిపోయాను.
' దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని
ఇవ్వు.....ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ వత్తిడితో నా భార్యను మంచిగా
ప్రేమగా చూసుకోలేకపోయాను.....నువ్వు చాలా అందంగా ఉన్నావనీ..
నువ్వు భార్యగా దొరకడం నా అదృ్ష్టం అని చెప్పలేకపోయాను........
నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను......నేను వచ్చేలోగానే నా
బిడ్డ నిద్రపోయేవాడు......
ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను
చూడలేకపోతున్నాను........చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని
వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను." అని బి్గ్గారగా
ఏడుస్తున్నాను......." దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు......నా తల్లి
మొహంలో నవ్వును చూడాలి.........నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు
ప్రాణబిక్ష పెట్టు స్వామీ! "
ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు......కళ్ళు తెరిచి చూశాను.
నా భార్య......" ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.
ఏమైంది మీకు ?" అని అడుగుతోంది.
అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట.
నిజంగానే నాకు ఇది మరుజన్మనే! ఆఫీసుకు టైం అయిందన్న నా
భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి
" నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని.....నీలాంటి అమ్మాయి నాకు
భార్యగా దొరకడం......నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా
ఉన్నావో తెలుసా ? " అన్నాను......ఆశ్చర్యంగా నా వంక చూసి
ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య,,,,,,
మిత్రులారా! మీకు ఇంకా చాలా సమయం ఉంది... మీ ఈగో లను
పక్కనపెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి....అన్నీ పోగొట్టుకున్నతర్వాత
బాధపడి ఏమీ లాభం లేదు......కుటుంబంతో గడపండి.........స్నేహితులతో
మంచిగా ప్రవర్తించండి......ఈ జన్మ దేవుడిచ్చినది......ఆనందంగా
జీవించి ఎందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా
మీవల్ల ఆనందంగా ఉండెటట్లు చూసుకోవలిసింది ఖచ్చితంగా మీరే!
..........ఇంత ఓపిగా చదివిన మీకు ధన్యవాదములు నచ్చితే లైక్
చేయండి.......ఇతరులకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి.....

Because my opinion is that they are better than 18 years old
It is well known to them ...... should also know ......
Please read ............ To be happy to know how to live happily
My optimism .......

At 6 o'clock in the morning ....... Attempt to go to the office
Am. But ...... I can not be lucky ...
"What happened to me? Why can not I?" I thought for a minute.
Yesterday at night I came to the room to sleep with my heart
Pain came ... I fell unconscious. Then what happened to me
I do not know .....
Coffee needs me ........ Where is my wife? Why did not you raise me?
Time for the office! Nobody is beside me. What happened to me?
There are many people outside the house .......
Are. Someone is dead ...... Ah! That's me! Oh my!
I'm dead? Many people are crying out ..... loud
I called ........ My words are not listening to anyone. Threatened
I drowned in my bedroom ... my wife is crying too much.
Holding the son ........ called the wife ........ my words to me
I did not hear ........ I went to another room ......
My mother in that room ... my father was sitting comfortably with one another
Swim; khanlo .......
I cried out loudly, "I'm still alive" .......
Not looking ..
I'm running out ....... My spouse is awful there
He is crying .... everyone else comforts me .......
I have been with my friend and have been with me from year to year
I stopped speaking ... ...... How many times have I been alive?
I'm dead .......... Yes, really
Dead.
'God! I am a resurrected father! Take me a few days
Give me ...... I have been busy with my job and my wife is good
I can not look it in love ... you're so beautiful ..
I can not tell you that you're my wife.
I could not get better with my baby ...... when I was there
Baby slept ......
My parents are still suffering from me as an infant
I can not see ........
I am a sinner who can not be forgiven by my friend. "
I'm crying ....... "Oh God!
To smile in the face and a few days for me to forgive me
Hello swamy! "
In the meantime, somebody shouted to me ... I opened my eyes.
My wife ...... "What's up? Dream is mad.
What's up to you? "
Is that what I'm dreaming for! That is why I did not die.
Really it's a repetition! I have time for the office
He called his wife and asked her to come back once
"Really I'm very fortunate ..... like a girl like me
To be a wife ...... I did not notice this beautiful day
Do you know where "I said ...... amazingly my look
My wife, who tears me
Friends! You have more time ... your ego
Put aside your family and love it all ... after losing everything
Do not get hurt and do not make any profit ...... spend with family ......... with friends
Be good ... ...... This is the birthday of God ...... happy
At least your family is not ideal for everyone to live
You're sure to be happy to be yourself!
.....................................................................................................................................................
Please do

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES