Thursday, February 15, 2018

*ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో మార్గాలుంటాయి. ఒక మార్గంలో చేరలేదు అంటే ఆ లక్ష్యానికి వేరే మార్గంలో ప్రయత్నించాలి. కృషి పట్టుదలతోనే విజయం సాధ్యం.*

*భయం ఉన్నవాడికి ఆలోచించే అర్హత లేదు ఏందుకంటే అతను ఏదీ సాధించలేడు కాబట్టి భయం వదిలిన రోజే అతను ఏదైన సాదించగలుగుతాడు. భయం వదిలిన రోజే అతనికీ ఒక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది.*
*విజయం సాధించాలి అంటే ప్రయత్నం కావాలి ప్రయత్నం చేయాలంటే మాత్రం ధైర్యం కావాలి*
*సాధించాలి అనుకున్న వారికి పక్కా ప్రణాళిక ఉండాలి, ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, ఆలోచనలు స్థిరంగా ఉండాలి,మాటల్లో  నిజాయితీ ఉండాలి,నిజాయతీ ఉన్నవారినే ఏదుటి వారు నమ్ముతారు, నమ్మకమే మన విజయానికి పునాది. కష్టపడే తత్వం కలిగి  కష్టాలను ఎదుర్కునే ధైర్యం కావాలి ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేసేవారు లక్ష్యాన్ని సులభంగా సాధించలేరు అందుకే బద్దకం వదిలి ప్రయత్నించాలి నీ పక్కన వారు ఏదో అనుకుంటారు అని భయపడకు. లోకులు కాకులు వాళ్ళ ఏడుపే మన ఎదుగుదల అని గుర్తుంచుకో ఏవ్వరిపై అతిగా నమ్మకం పెంచుకోకు అలాగని ఏవ్వరినీ నమ్మక పోవడం కూడా తప్పవుతుంది, విజయం సాధించాలి అనుకుంటే ఆ విజయం సాధించడానికి సంబందించిన అన్ని విషయాలను క్షుణంగా తెలుసుకునే ఆసక్తి కలిగి ఉండాలి, మన ఆలోచనలే మొదటి పెట్టుబడి కాబట్టి ప్రయత్నం చేయడంలో భయపడకు ఏందుకంటే ఓటమి కూడా గెలవడానికి పాఠాలు నువ్వు చేసిన తపులను చూపుతుంది ఓటమిని స్వీకరించిన వాడికే గెలుపు చేరువవుతుందీ గొప్ప గొప్ప వారి విజయాన్ని చూసేముందు వారు ఆ విజయానికి పడ్డ కష్టాన్ని వారు పడ్డ బాధల్ని తెలుసుకో. సంతోషం వెంటే ధుఃఖం విజయం వెంటే ఓటమి ఉంటాయి, ఎవ్వరి సలహలను స్వీకరించకు ఎందుకంటే ఎవ్వరి సలహావెనుక ఎవరి ప్రయేజనం దాగుందో తెలియదుకదా.*
*గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి– చెగువేర*
*నువు దైర్యంగా ఓక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది-రవీంద్రనాథ్ ఠాగూర్*
*భయపడటం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు–చేగువేర*

*ఇలా గొప్ప వారు చెప్పిన మొదటి మాట భయం వీడి విజయాన్ని సాధించు. నీపై నీకు నమ్మకం, సాధించగలననే ధీమా ఉన్నప్పుడే ఏ ప్రయత్నమన్నా మొదలుపెట్టు. నీ గురించి నీకన్నా బాగా ఎవ్వరికీ తెలీదు అందుకే నీకు సంబందించిన నిర్ణయాలు నీకన్నా బాగా ఎవ్వరూ తీసుకోలేరు*

*దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా*
*దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా*
*భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా*
*బాధ వెంట నవ్వులపంట ఉంటుందిగా*
*సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది*
*విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ*
*అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ*
*కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ*
*తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ*
*మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది*

*ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో మార్గాలుంటాయి. ఒక మార్గంలో చేరలేదు అంటే ఆ లక్ష్యానికి వేరే మార్గంలో ప్రయత్నించాలి. కృషి పట్టుదలతోనే విజయం సాధ్యం.*

*చీకట్లో కూర్చోని వెలుగు రావాలి ఎవ్వరైనా దీపం వెలిగించాలి అనుకోకు ఎందుకంటే ఎవ్వరి దీపం వారే వెలిగించుకోవాలి.*

0 comments:

Post a Comment

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

TSWREIS E- TOOL

TS PRC2015

NOTIFICATIONS

TS LATEST UPDATES


Top