🔮 *TSCPSEU*🔮
------------------------------------------------------
*_ఏప్రిల్15,జన జాతర, ఎక్సిబిషన్ గ్రౌండ్స్, హైదరాబాద్_*
_సీపీయస్ ఉద్యోగ,ఉపాధ్యాయ కుటుంభ సభ్యులచే_
------------------------------------------------------
*ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఎందుకివ్వాలి ??*
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వీసు లో ఉండగా కేవలం జీతం మీదే ఆధారపడి బ్రతకాలి . పదవిలో ఉండగా తాను గాని, కుటుంబ సభ్యులు కానీ ఏ విధమైన వ్యాపారాలు కానీ ఇతర డబ్బు సంపాదించే వ్యవహారాలు చేయకూడదు. ఆస్తులు సమకూర్చుకోకూడదు. 5,000 రూపాయల పైబడి వస్తువులను ,ఆస్తులను కొన్నా , ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఒక ఉద్యోగి తన జీవితంలో అనుకోని కారణాల వలన మరణించినా లేదా పదవీ విరమణ అనంతరం తనకు ,తన పైన ఆధారపడిన కుటుంబానికి సామాజిక ,ఆర్థిక భద్రత కొరకు ,వృద్దాప్యంలో సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అప్పటివరకు వచ్చిన జీతo ఆగిపోతుంది.
🔮 *TSCPSEU*🔮
*పెన్షన్ గురించి సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది ??*
1952 సం!!రం లో , సుప్రీంకోర్టు లో జరిగిన DS నటారా vs govt of india మధ్య జరిగిన పెన్షన్ కేసులో ఇలా తీర్పు ఇచ్చింది. భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 11, 14,16 ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కని, మూడు దశాబ్దాలుపైగా ప్రభుత్వానికి సేవలు చేసిన ఉద్యోగికి ఇచ్చే విలువగా చూడాలని,అది ఉద్యోగికి ఇచ్చే కాంపెన్షషన్ కాదని ,ఉద్యోగికి ఆర్థికంగా సామాజికంగా భద్రతను కల్పించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టంగా చెప్పటం జరిగింది.
🔮 *TSCPSEU*🔮
*పాత పెన్షన్ విధానం స్థానంలో నూతన పెన్షన్ విధానo(CPS)ఎందుకు వచ్చింది. ???*
భారతీయుల సగటు జీవితకాలం పెరిగినందున పెన్షనర్లకు పెన్షన్ చెల్లించడం కష్టమై ఆర్థిక వ్యవస్థపైభారం పడుతుందని పెన్షన్ విధానాన్ని సంస్కరించి ప్రైవేటీకరించాలని , అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత ప్రభుత్వానికి (IMF) సూచించింది. దానికనుగుణంగా అప్పటి NDA ప్రభుత్వం, 2001-02 సంవత్సర౦ పెన్షన్ విధా నంలో మార్పు చేయడానికి బి.కె. భట్టాచార్య నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ ప్రతిపాదనలను తేదీ 23.08.2003 రోజున ఆమోదించారు, డిసెంబర్ 2003 లో PFRDA బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది.
🔮 *TSCPSEU*🔮
*CPS ఎలావుంటుంది.??*
నూతన పెన్షన్ ప్రకారం Basic,DA పైపది శాతం గా వాటా కట్‌చేసి అంతే మొత్తానికి సమానమైన వాటాను ప్రభుత్వం CPS ఖాతాలో నిధిగా జమ చేస్తుంది. ఈనిధిని షేర్ మార్కెట్ లో ఫండ్ మేనేజర్లు ద్వారా నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL )ద్వారా పెట్టుబడి పెడతారు.
🔮 *TSCPSEU*🔮
*NSDL నిర్వహణ-పనితీరు ఎలా ఉంది ??*
మొదట్లో సిపిఎస్ ఖాతా నిర్వహణకుఉద్యోగి ట్రెజరీ ఐడీ పై నిధిని జమ చేసేవారు. కానీ 2009 తర్వాత సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీ (CRA) మరియు NSDL రూపొందించిన పర్మినెంట్ రిటైర్మెంట్ ఎక్కౌంట్ నెంబర్ PRAN ప్రాన్ ఖాతాలోనిధిని జమ చేయటం జరుగుతుంది.
🔮 *TSCPSEU*🔮
*CPS ద్వారా జీతంలో కట్ చేసిన మొతాన్ని ఏంచేస్తారు ??*
NSDL లో SBI కిచెందిన 15 రకాల,LIC కి చెందిన 10రకాలు,HDFC, ICICI, వంటి వివిధ రకాల మ్యూచవల్ ఫండ్స్ అందుబాటులో ఉంటాయి. ఉద్యోగి సర్వీసులో ఉన్నంత కాలం వసూలైన డబ్బును ప్రభుత్వం వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతూదానిపై వచ్చే లాభనష్టాలు ఆధారంగా ఉద్యోగస్థులకు పింఛన్ ని నిర్ణయించడం జరుగుతుంది.
🔮 *TSCPSEU*🔮
*NSDLలోపాలు ఏమిటి ??*
1) దరఖాస్తు చేసిన వారికి PRAN కార్డ్ సకాలంలో రాకపోవటం
2) ఉద్యోగుల సంప్రదింపులకు అందుబాటులో లేకపోవటం
3) ఖాతాదారుల వివరాలను మార్పు చేయకపోవటం
4) ప్రభుత్వo,ఉద్యోగి యొక్క మ్యాచింగ్ గ్రాంట్‌ను నెల నెలా ఉద్యోగ ఖాతాలో సరిగా జమ చేయకపోవడం
5) ఖాతాలో జమ అయ్యే మొత్తంలో అధిక తేడాలు ఉండటం
6) తమ తమ ఖాతాలో నిధులు సరిగ్గా జమకావడం లేదని ఎన్నిసార్లుఫిర్యాదు చేసినా తిరిగిమళ్లీ జమ చేయలేకపోవడం
7) చనిపోయిన ఉద్యోగ కుటుంబాలకు వారి ఖాతాలో ఉన్న నిధిని సకాలంలో ఆదించలేకపోవడం
8) స్థానికంగా కార్యాలయాలు లేకపోవడం
9) దాదాపు 530కోట్ల రూ,ఉద్యోగుల సొమ్ము మాయం కావడం
10) సిపిఎస్ కార్యాలయాలు ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం లలో మాత్రమే ఉన్నాయి.
🔮 *TSCPSEU*🔮
*CPS విధానాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్రమా ?? కేంద్రమా ??*
CPS విధానాన్ని రద్దు చేయాల్సింది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమే!! పాత పెన్షన్ అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని విధానంలో కొనసాగాలన్న స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర ఆర్థిక శాఖ ఏనాడో స్పష్టంగా చెప్పడం జరిగింది. పశ్చిమబెంగాల్ త్రిపుర రాష్ట్రాల్లో ఈ నాటికీ కూడా పాత పెన్షన్ విధానమే కొనసాగుతుంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, ఇతర 4,5 రాష్ట్రాలు పాత పెన్షన్ విధాన పునరుద్ధరణకు కమిటీలు వేసి అధ్యయనం చేస్తున్నాయి
🔮 *TSCPSEU*🔮
*సిపిఎస్ విధానం లోని నష్టాలు ??*
1. ఉద్యోగి పెన్షన్ కు ప్రభుత్వం ఎటువంటి గ్యారంటీ కానీ హామీ గానీ బాధ్యత తీసుకోదు
2. ఉద్యోగి మూలవేతనం +కరువు భత్యం పై పది శాతం నగదు ను కత్తిరిస్తుంది.
3. షేర్ మార్కెట్ జూదంపై ఆధారపడటం.
4. గ్రాట్యూటీ లేదు.
5 . ఫ్యామిలీ పెన్షన్ లేదు.
6. పెన్షన్ నిధి పై పది శాతం పన్ను ఉంటుంది.
7. కమ్యుటేషన్ ప్రస్తావన లేదు (OPS లో40% కమ్యూటేషన్) .
8. విరమణ అనంతరం హెల్త్ కార్డ్ సదుపాయం లేదు .
9. అత్యవసర లోఆదుకునే GPF లొన్ వంటి సదుపాయం లేదు.
10. పదవీ విరమణ సమయంలో 60%పోను,మిగిలిన 40శాతం నిధిని మళ్లీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆ రోజు ఉన్న మార్కెట్ పై పెన్షన్‌ని నిర్ధారించడం,ఒకవేళ మార్కెట్లో నష్టాలు వస్తే పెన్షన్ అమాంతం పడిపోవడం.
11. (DA డీర్ నెస్ అలెవెన్స్ ) కరువు భత్యం సదుపాయం లేకపోవడం.
12. PRC లలో పెరుగుదల లేకపోవడం.
13. PFRDAచట్టంలో లోని సెక్షన్ 12, సబ్‌సెక్షన్ 4,5 ప్రకారం 2004సం,, కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారి కి కూడా నూతన పెన్షన్ విధానాన్ని విస్తరించే ప్రమాదం పొంచి ఉండటం.
14. పాత పెన్షన్ విధానంలోఉద్యోగి మరణించిన ఒక్కరోజులోనే అతనికి సంబంధించిన అన్ని బెన్ఫిట్స్ క్లైమ్ ఆవుతయీ. కానీ సిపిఎస్ విధానం అసలు క్లైం చేసుకునే విధానం తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది వీటిపై ఉద్యోగస్తులకు కూడా పూర్తి అవగాహన లేదు.ఉద్యోగికి సంబంధించిన అన్ని బెన్ ఫిట్స్ రావడానికి దాదాపు2-3సంవత్సరాలు పడుతుంది.
15) ఖాతా నిర్వహణకు చార్జెస్ వర్తిస్తాయి.. పాత పెన్షన్ లో ఎటువంటి చార్జెస్ ఉండవు.
🔮 *TSCPSEU*🔮
*CPS పెన్షన్ చెల్లింపులు ఎలా ఉంటాయి. ??*
1) స్వచ్ఛంద పదవీ విరమణ సమయంలో...
ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తంలో ఇరవై శాతం నిధిని చెల్లిస్తారు. మిగతాఎనభై శాతం ను నెలవారీ పెన్షన్‌గా ఇవ్వడానికి వివిధ రకాల పథకాలలో పెట్టుబడి పెడతారు.
2) సాధారణ పదవీ విరమణ సందర్భంలో...
ఉద్యోగి సాధారణ పద విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తంలోఅరవై శాతం నిధిని చెల్లిస్తారు మిగతా నలభై శాతం లో వివిధ రకాలపథకాల్లో పెట్టుబడి పెట్టి పెన్షన్ అందజేస్తారు.
3) అకాల మరణం చెందినపుడు.....
ఉద్యోగి ఖాతాలో ఉన్న 100% నామినీకి చెల్లిస్తారు.
🔮 *TSCPSEU*🔮