Friday, September 28, 2018

భగత్‌ సింగ్‌.. దేశభక్తికి ప్రతిరూపం భగత్‌ సింగ్‌...ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్ సింగ్‌ ...ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి.  భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌.ఆయన జయంతి సెప్టెంబర్‌ 28.

ఆ... యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్‌ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగులేశాడు. ఇరవైమూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. ఆయనే భగత్‌సింగ్‌. ఆయన జయంతి సెప్టెంబర్‌ 28.
కె కె వి నాయుడు.

భగత్‌ సింగ్‌.. దేశభక్తికి ప్రతిరూపం
భగత్‌ సింగ్‌...ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం.
భగత్ సింగ్‌ ...ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి.  భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్‌.

అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.

1907 సెప్టెంబర్‌ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్‌ జిల్లా బంగాలో... ఆ విప్లవ వీరుడికి కిషన్‌ సింగ్‌, విద్యావతి దంపతులు జన్మనిచ్చారు.
భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ  విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు.

యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు  సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు. భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్‌లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది.

12 ఏళ్ల వయసులో బ్రిటీష్ పాలకులపై కసి ఉరకలేస్తున్న  యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్‌ వాలాబాగ్‌ దారుణాలను చూసి భగత్‌సింగ్ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్‌ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్‌ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు.
1928లో సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమం
1928లో సైమన్‌ కమీషన్‌ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో... లాలాలజపతిరాయ్‌ చనిపోవటం తో భగత్‌సింగ్‌ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్‌ వేశారు. విజిటర్స్‌ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు.
1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీత బ్రిటీష్‌ హై కమిషనర్‌ సాండర్స్‌ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్‌సింగ్‌తో పాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను 1931 మార్చి 23న లాహోర్‌లో ఉరితీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్‌సింగ్‌ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారు. కానీ భగత్‌సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్ధాన్‌ పోలీస్‌ శాఖ లాహోర్‌ న్యాయస్ధానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్‌ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా... తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు.

భగత్‌సింగ్‌ను పొట్టనపెట్టుకున్న బ్రిటీష్ పాలకులు చరిత్ర  వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్‌సింగ్. భరతమాత సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి. త్యాగం, ఆదర్శానికి ఆయన నిదర్శనం. అదే నేటి వెలుగు దారి.

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES