Monday, September 3, 2018

నేటి విద్యా వ్యవస్థ పై డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అంతరంగం - అందరూ చదవాల్సిన వ్యాసం ఇది.

నేటి విద్యా వ్యవస్థ పై డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అంతరంగం - అందరూ చదవాల్సిన  వ్యాసం ఇది.
--------------------

(భారత ఉప రాష్ట్రపతి, గౌరవ వెంకయ్య నాయుడు గారు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఉపాద్యాయుల దినోత్సవంలో ప్రస్తావించబడిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆర్టికల్ ఇది)

_*GREAT TEACHERS LIVE THROUGH US, BEYOND US...*_

```నిజాయితిగా చెప్పాలంటే, నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే అది కేవలం నా ఉపాద్యాయుల వల్లనే. నేను నడిచే విధానం, మాట్లాడే విధానం, చదివే విదానం, బట్టలు ధరించే విదానం అన్ని కుడా ఉపాద్యాయుల ప్రేరణ వల్లన వచ్చినవే. ఈ విషయం ఇప్పటికి ఎవ్వరికి తెలియదు. వారు నేర్పిన జ్ఞానం వల్లనే నేను నా జీవితంలో ఎలా ఉన్నత శిఖరాలు అధిరోహించాలో, సమస్యల సుడిగుండాలను ఎలా అధిగమించాలో నేర్చుకున్నాను. ఇప్పటి వరకు వంద మంది ఉపాద్యాయులు నాకు భోదించారు కానీ కొందరితో మాత్రం నా సానిహిత్యం ఇప్పటికి కొనసాగుతుంది, ఎందుకంటే వారు జీవిత ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నారు కాబట్టి. నా గొప్ప గురువులైన హంపయ్య, నరసింహ రెడ్డి, పద్మావతి గారి గురించి చెప్పటం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.
నేను గద్వాల జిల్లా, అల్లంపూర్ లో ఉన్న హై స్కూల్ లో చదువుతున్నపుడు హంపయ్య సారు నాకు ఇంగ్లిష్ భోదించారు. అతడు బోదించే ప్రతిది ఎంతో అక్కట్టుకునే విదంగా ఉండేది. అతడు ప్రతి విద్యార్ధిపై వ్యక్తిగత శ్రద్ద చూపేవాడు. స్కూల్ టైం అయిన తరువాత సార్ ఇంట్లో గడిపే స్వేచ్చ ఉండేది, అ సమయంలో ఎన్నో విషయాలు బాగా అర్థం అయ్యే విదంగా చెప్పేవాడు. నిజంగా చెప్పాలంటే, సార్ సెలవుపై వెళ్ళినప్పుడు, స్కూల్లో ఉండకుoడ వచ్చేయాలి అని అనిపించేది. ఈ మద్య కాలంలో ఉపాద్యాయుడు మరియు విద్యార్థులు స్నేహపూర్వకంగా ఉంటూ చదువు నేర్చుకోవాలి అని వాధోపవాదాలు జరుగుతున్నాయి కానీ హంపయ్య సార్ ఆ రోజులలోనే ఇది సాధ్యం అని నిరూపించాడు. సార్ ఎంతో క్రమ శిక్షణతో ఉండేవాడు, కానీ మాకు ఇంగ్లీష్ భాషపై ఒక మంచి పునాది వేయడానికి కావలసిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. హంపయ్య సార్ లాంటి వాళ్ళు నా హై స్కూల్ జేవితాన్ని ఒక మధురమైనా జ్ఞాపకంగా మారిస్తే, ప్రొఫెసర్ ఏం .యెన్ .రెడ్డి మరియు ప్రొఫెసర్ పద్మావతి గారు నా కాలేజీ మరియు యూనివర్సిటీ జీవితాన్ని మలిచి నన్ను క్రొత్త మార్గ నిర్దేశకత్వం లోకి నడిపించారు.```

```ప్రొఫెసర్ ఎం ఎన్ రెడ్డి గారు MNR గా అందరికి తెలిసిన వ్యక్తి, వ్యవసాయ విశ్వ విద్యాలయంలో అతను మేద్దస్సుకు మారుపేరుగా ఉండేవారు. అతడు కోర్సు ను బోధించే విదానం, ఆవిష్కరణ, అనువర్తన బోధించే విధానం పూర్తిగా హార్వర్డ్ యూనివర్సిటీ లో ప్రఖ్యాతిగాంచిన మైకేల్ సండేల్ చెప్పే విదంగా ఉండేది. అతడు టాపిక్ ను ఊహించలేనంత లోతుగా అన్వేషించి, దాన్ని సమకాలిన పరిస్తితులకు అనుకూలంగా మలిచి, సాధారణ విషయంలా మార్చి, జ్ఞానం కోసం ఆత్రుతతో ఉన్న మా మెదడులోకి ఎక్కించే వాడు. అతనిలో ఉన్న నేర్పరితనం ఏమిటి అంటే, విద్యార్థులకు కష్టమైన వాటిని సులభంగా ఎలా సాధించాలో అని నేర్పించి సహకరించే వాడు. నేను సివిల్స్ సాధించాను అంటే దానికి MNR సార్ నాకు స్ఫూర్తి. అతను సివిల్స్ సాధించిన తన క్లాస్మెంట్స్ గురించి చెప్పి మమల్ని సివిల్స్ వైపునకు ప్రేరిపించాడు. అదృష్టావశత్తు అతను ఒంటరివాడు కాదు.```

```నాకు పరాన్న జీవ శాస్త్రాన్ని బోధించిన ప్రొఫెసర్ P.పద్మావతి గారు, రకరకాలైన సిద్దంతాలపై ఉగిసలాడుతూ, ప్రోత్సహకరంగా ఉన్న తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ, ప్రతి దినం సందిగ్దంలో ఉంటున్నపుడు ప్రొఫెసర్ P.పద్మావతి గారు మాకు ఎంతో మానసిక ఆదరణ ను కల్పించి, కల్లోలిత యూనివర్సిటీ వాతావరణానికి తట్టుకొని, స్థిరంగా ఉండే విదంగా ప్రోత్సహించారు. అప్పుడు వారే మా ప్రపంచం, కానీ వారు ఎప్పుడు కూడా వారి యెక్క వ్యక్తిగత సమస్యలను మాకు తెలియకుండా జాగ్రత పడేవారు. సంతోసoచదగిన విషయం ఏంటంటే, P.పద్మావతి గారి లాంటి వ్యక్తులనే తరువాతి కాలంలో కనుకొన్నాను.
సాంఘిక సంక్షేమ మరియు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్స్ సెక్రెటరీగా పని చేస్తునప్పుడు, నాకు భోదించిన ఉపాద్యాయుల వంటి వారిని కొంత మందిని గమనిoచాను. వారికి వ్యక్తిగత సమస్యలు ఉన్నపటికీ, ప్రతి రోజు విద్యార్థులకు మరియు వ్యవస్థకు జీవాన్ని పోస్తున్నారు. నేను కనుగొన్న మరో సంతోషించే విషయం ఏమిటంటే, కొంతమంది యువ ఉపాద్యాయులు వారి వారి పిల్లలను వారు పని చేస్తున్న స్కూల్లలోనే చేర్పిస్తున్నారు. కానీ అలాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి గొప్ప ఉపాద్యాయులను గుర్తించి, గౌరవించి, రక్షణ కల్పించాలి. అభివృద్ధి చెందిన సంఘంగా ఉన్న మనం చీడ పురుగుల్లాoటి మరో రకం టీచర్స్ గుంపు.గురించి భాద పడాల్సి వస్తుంది.```

```ఒక రకమైన టీచర్స్ తరగతి ఉంది. వారి గురించి ఆలోచించటం నాకు ఎంతో సంతోషాని ఇస్తుంది. ఇలాంటి వారికి విరుద్దంగా ఉండే మరొక టీచర్స్ గుంపు ఉంది. పేర్లు చెప్పకుండా ఎన్నో అనుభవాలను నేను చెప్పగలను. వారు అన్నిటిని సాదిస్తారు, అనుభవిస్తారు కాని ,విద్యను బోధించటం లో మాత్రం కాదు. వారు కాంపస్ లోనే సిగరెట్స్ త్రాగుతారు, పేకాటలు ఆడుతారు, క్లాసెస్ కు రాకుండా ఎగ్గోడుతారు, ఎప్పుడు రాజకీయం గురించే మాట్లాడతారు, చిట్స్ కంపనీలను నడుపుతారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, స్కూల్ బయట టూష్యన్స్ చెప్పుతారు, క్లాసులో ఉన్న తెలివైన విద్యార్థుల చేత క్లాసెస్ చెప్పిస్తారు, పరిక్ష పేపర్స్ దిద్దిస్త్తారు. ఎవరైనా విద్యార్తులు నిజాయితిగా ప్రశ్నిస్తే, వారిని హింసిస్తారు. వారి దృష్టిలో టీచర్ జాబ్ కేవలం గౌరవాన్ని ఇచ్చే గుర్తు, ఆదాయం ఇచ్చే మార్గం. వారిలో కొంత మంది సంఘాల నాయకులు. వారిని ప్రశ్నించే దైర్యం స్కూల్స్ లో ఎవ్వరికి ఉండదు. వారు విద్యార్థులకు కొన్ని ప్రశ్నలను బట్టి పట్టించి కేవలం పాస్ అయేటట్లు చేస్తారు. ఇలాంటి టిచర్స్ సంస్థలో చాలా ప్రభావితం చేసేవారుగా ఉంటారు. వారు విద్యర్తులపై సవితి ప్రేమ చూపిస్తూ విద్యార్తులను గ్రూపులుగా చేసి వాడుకుంటారు. వారి తరగతిలో నేను సమయం గడపటం నాకు చాల భాద అనిపిస్తుంటుంది. క్లాస్ రూమ్స్ లో ఇలాంటివారు ఉంటె ఏ విధంగా మనం లక్ష్యల మంది విద్యార్థుల కలలను నెరవేర్చగలo? మనం సమాదానo మరో రూపంలో వెదకాల్సి ఉంటుందేమో?```

```మొట్టమొదటగా మంచి జ్ఞానం ,యోగ్యత ఉన్న వారినే ఎంచుకుంటే, విద్యా వ్యవస్థ అంతరించి పోకుండా కాపాడగలం. మన అదృష్టాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం KG-PG మిషన్ విద్యపై ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుంది. TSPSC మార్గ నిర్దేశాకాలా ద్వారా మంచి టీచర్స్ వస్తరని ఆశిద్దాం.```

```రెండవదిగా, టీచర్లను గుండె శస్త్ర చికిత్స చేసే డాక్టర్స్ లాగా, జెట్ ప్లేన్ నడిపే పైలేట్స్ వలే వారిని పూర్తిగా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు గుండె ఆపరేషన్ చేసే వారు, జెట్ నడిపే వారు అంత పర్ఫెక్ట్ గా ఉంటారు అంటే? వారు ఎంతో కటోరమైన శిక్షణ తీసుకుంటారు, సందిగ్ద పరిస్తితిలో సరైన నిర్ణయం తీసుకోవటం నేర్చుకుంటారు కాబట్టి. వారి ఉద్యోగాలు ప్రాణాలతో ముడిపడి ఉన్నాయి, ఏ మాత్రం నిర్లక్యం ఉన్న ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. టిచర్ ఉద్యోగo కుడా అలాంటిదేనా? కాదు. ఉపాద్యాయుడు తరగతి గదిలో ఉండే విద్యార్థులు జీవితాలు మాత్రమే కాదు, సమాజము నాగరికతనే అతను నడిపిస్తాడు. క్లాసు రూమ్ లో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న నిర్విర్యమైన విద్యార్థి తరం బయటికి వచ్చే ప్రమాదం ఉంది. ఏ కొద్దిపాటి ఉదాసీనత ఉన్నా, దేశం ఒక నాయకుణ్ణి, మేధావిని, అభ్యుదయవాదిని కోల్పోయే ప్రమాదం ఉంది. బాద్యత రాహిత్యం వాళ్ళ కలిగిన దుష్పారినామాల్ని నా సర్విస్ లో ఎన్నో చూశాను. వారు మనం నిత్య జీవితంలో చూసే ఎన్నో అంశాల్ని వారు నాశనం చేసారు. సివిల్ సర్వీస్ కానీ, పరిశ్రమలు కాని, సాంఘిక జన జీవనం పాడైపోయింది. చివరగా, విద్య వ్యవస్థ లో ఉన్న లోపాలకు టీచర్స్ ను మాత్రమే బాద్యులు చేయడం ఏ మాత్రం న్యాయం కాదు.```

```విద్యార్ధి పై ఉపాద్యాయులు కేవలం 25% మాత్రమే ప్రభావితం చూపుతున్నారు అని పరిశోధనలు తెలియజేస్తునాయి. అయితే, మిగిలింది ఎవరు ప్రభావితo చేస్తున్నారు? అది తల్లి తండ్రులు, స్నేహితులు, సమాజం మరియు మీడియా. ఎంత మంది మనలో సరి అయిన విధంగా పిల్లల పెంపకం పైన బద్యత తీసుకుoటూ టిచర్స్ ను అడుగుతున్నాం? ఎవరికైనా గుర్తుందా? ఎప్పుడైనా మన పిల్లలకు చదువు చెప్పే ఉపాద్యాయులను మన ఇంటికి ఒక కప్పు కాఫీ కోసం ఆహ్వానిoచామా? ఎంతో మంది ప్రముఖ వ్యక్తులను సన్మానిస్తుటాo? ఉపాద్యాయులను కుడా అలా ఎప్పుడైనా సన్మానించామా? ఇంత వరకు ఏ ఒక్క మంచి ఉపద్యాయుని విగ్రహం నేను ఏ ఊర్లో కుడా చూడలేదు. దేశం మొత్తంలో ఎన్ని వీధులకు ఉపాద్యాయుల పేర్లు పెట్టారు? ఉపద్యాయులకు చాలా పెద్ద మొత్తంలో జీతాలు వస్తాయి కాని వారి వల్ల మన పల్లలకు IIT సీట్లు కానీ, మెడికల్ సీట్స్ కానీ రావటం లేదు అని మనం అనుకుంటాము. కేవలం ఈలాంటి మన మనోవైకరి వల్లనే మంచి ఉపాద్యాయులు ప్రమాదంలో పడిపోతున్నారు, అటో ఇటో తేల్చుకోలేని వారు శాశ్వత నిరాశలోకి పోతున్నారు. ఈ విధానం తప్పక మారాలి.
కేవలం ఉపాద్యాయులే సమాజాన్ని ముందుకు నడిపే వారు. ఒక్కసారి సావిత్రి భాయి, ఫూలే, కలాం లేని లోకాన్ని ఉహించండి. ఆమె 19వ శతాబ్దంలో స్త్రీలను, వితoతువులను విద్య వైపు నడిపించకుంటే, మన స్త్రీలు ఈ రోజు ఎక్కడ ఉండేవారు?.```
```గొప్ప ఉపాద్యాయులు మనలో జీవిస్తారు, మన పరిధి దాటి జేవిస్తారు, మనం వారి మూలంగా జీవిస్తాం.
వారికీ మరణం లేదు.```
*- Dr. R. S. _ప్రవీణ్ కుమార్ స్వేరో_, IPS*

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES