Sunday, September 23, 2018

నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది🌸

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు .కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం .అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉందాం🌸
🙏మౌనం మనస్సుని  శుద్ధి చేస్తుంది .స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్దిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది .ఉపవాసం ఆరోగ్యాన్నీ శుద్ది చేస్తుంది. అలాగే క్షమాపణ సంబంధాలనుశుద్దిచేస్తుంది🌸
🙏ఎవరితో అయినా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి .అందరూ మనవాళ్ళే అని వాళ్ళమంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ వాళ్ళం అవుతాం.    జాగ్రత్త🌸
🙏నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి🌸
🙏సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి .ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి🌸
🙏జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.చాలానే చూడాల్సివస్తుంది. వాటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే జీవితం అర్ధవంతంగా ఉంటుంది .ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం🌸
🙏కరుగుతున్న కాలానికి జరుగుతున్న సమయానికి అంతరించే వయసుకి మిగలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం🌸
🙏అదృష్టం అంటే ధనం వస్తువులు ఉండడమే మాత్రమే కాదు .చేతినిండా పని, కడుపు నిండా తిండి, కంటినిండా నిద్ర ,అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం🌸
🙏మనల్ని అర్ధం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు .కానీ మనకే విలువ లేనిచోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించిన వ్యర్ధమే🌸
🙏మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్ధం అవుతుంది .గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది .నేనే నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సివస్తుంది. గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే మంచి జీవితం🌸
🙏నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది🌸
🙏ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో. అలాగే నీకన్న తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు. పై స్థాయి వారిని  చూసి లక్ష్యమేర్పరచుకో🌸
🙏నీవు ఈ ప్రపంచానికి అర్ధం కాకపోయినా బ్రతికేయవచ్చు. కానీ నీకు నువ్వే అర్ధం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు🌸
🙏జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు .వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు.🌸🍁🍁🍁🍁🍁🍁🍁🍁

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top