Sunday, September 23, 2018

నవ భారత నిర్మాత ఉపాద్యాయుడే.

a బడ్డీకొట్టు..... is better than..
teaching profession.....
( చాలా మంది అంతరంగం)

భవిష్యత్.. అంధకారం

system లో..  పాఠం చెప్పేవారిని..
ఇంటింటా తిరిగి ..
అడ్మిషన్ లు అడుక్కొని వచ్చే బ్రోకర్లు గా మార్చేశారు .

ఇంకా గౌరవం ఎక్కడ ?

పిల్లాడేమో ఇంటికెళ్ళాక రోజంతా సెల్ ఫోన్ పై బిజీ .. వీడియో గేమ్స్ .. చాటింగ్ .. నీలి చిత్రాలు .. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు లేదు . ఇలా అయితే లాభం లేదు . రేపు మీ తల్లితండ్రుల్ని రమ్మను , నేను మాట్లాడుతాను అంటాడు టీచర్ .

ఇంటికెళ్లిన పిల్లాడు ..
తాను ఇంటర్ నెట్ ప్రపంచంలో నేర్చుకొన్న తెలివి మొత్తాన్ని ఉపయోగిస్తాడు .

"డాడీ .. ఆ టీచర్ నాపై కక్ష కట్టాడు .
అకారణంగా నన్ను రోజు తప్పుపడుతున్నాడు" అంటాడు .

తండ్రి .. వెంటనే ఫోన్ తీసుకొని పిల్లాడి ముందే టీచర్ని అమ్మనా బూతులు .. ప్రిన్సిపాల్కు వార్నింగ్ .. మీడియాను పిలుస్తాను అని బెదిరింపు .

ఏమి జరిగింది సర్ అని ప్రిన్సిపల్ అడిగితే.
టీచర్ "జరిగింది ఫలానా ..
నేను కేవలం ఆ అబ్బాయ్ ని మంచిదారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అంటాడు ."

అలా కాదు సర్ .. పేరెంట్ మీడియా అంటున్నాడు . మళ్ళీ వాళ్ళు వస్తే ఏదో చిలవలు పలవలు చేస్తారు . ఎందుకొచ్చిన గోల .. పేరెంట్ కు సారీ చెప్పు" అని ప్రిన్సిపాల్ .
అంటే..
తాను చెయ్యని తప్పుకు సారీ చెప్పిన టీచర్ కి మానసిక మరణం .
ఇక కేవలం ఏదో బతకడం కోసం ఉద్యోగం .

మనసు విరిగిన టీచర్ ఇక పిల్లల్ని ఏమని దారిలో పెడుతాడు ?

పైగా ఆ పిల్లాడు మరుసటి రోజు స్కూల్ కు వచ్చి నేను...
ఈ టీచర్ తిక్క బాగా కుదిర్చాను .
మా నాన్న బూతులు తిట్టాడు .
వీడు సారీ కూడా చెప్పాడు .
ఇక మనల్ని ఏమైనా అంటే ఇదే చేద్దాం అంటాడు . ఇక టీచర్ కు మిగిలిన గౌరవం ఏది ?

పాఠం  చెప్పేవాడు.. నాకెందుకులే... అనుకున్నాడా.. వ్యవస్ధ సర్వనాశనం..

సమస్య ఉందని అందరికీ తెలుసు .
కానీ అందరిదీ నటన .
మహా నటులు .
నిద్ర పోతున్నవాడ్ని లేపవచ్చు .
కానీ నటిస్తున్న వాడిని లేపడం ఎలా ?

చంపెయ్యండి..
టీచర్ ను నైతికంగా.. మానసికంగా..
చంపెయ్యండి .
బతక లేక ..బడి పంతులు నిన్నటి మాట .
 
బతక లేకపోతే ..
బస్సు స్టాండ్లో పల్లీలు అమ్ముకో .

పొరపాటున టీచర్ అయ్యామంటే అయిపోతావు .. నువ్వొక జోకర్ .. బ్రోకర్ .. క్రిమినల్ .

నవ భారత నిర్మాత ఉపాద్యాయుడే. .

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top