♻️ఏది సమస్య..? ♻️🔸
🌀గూగుల్ సంస్థ సీయీవో సుందర్ పిచ్చాయ్ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ...🌀
🔸 ‘ఒకసారి నేను రెస్టరెంట్కి వెళ్లాను. నాకు కొంత దూరంలో ఉన్న టేబుల్ దగ్గర ఇద్దరమ్మాయిలు కూర్చుని ఉన్నారు. ఎవరి మాటల్లో వారుండగా ఎక్కణ్నుంచి వచ్చిందో బొద్దింక ఒకమ్మాయి మీద పడింది. అంతే ఆ అమ్మాయి లేచి రెస్టరెంట్ దద్దరిల్లేలా అరుస్తూ గెంతులేసి ఎలాగైతేనేం ఆ బొద్దింకను విసిరికొట్టింది. అదికాస్తా వెళ్లి పక్కనున్న అమ్మాయి మీద పడింది. ఆమె కూడా అలాగే గగ్గోలు పెడుతూ దాన్ని తోసేసింది. అది ఈసారి అటుగా వచ్చిన సర్వర్ మీద పడింది. అతను చాలా శాంతంగా దాన్ని తీసుకెళ్లి బయటపడేశాడు. అదంతా చూసిన నాకు ‘అక్కడ సమస్య బొద్దింకా లేక ఆ ఇద్దరమ్మాయిలా..?’ అనిపించింది.
🔸బొద్దింకే అయితే, సర్వర్ కూడా వాళ్లలా కంగారుపడాలి కదా... అంటే కారణం బొద్దింక కాదు. దాని వల్ల కలిగిన ఇబ్బందిని ఆ ఇద్దరమ్మాయిలూ ఒకలా స్వీకరిస్తే అతను మరోలా స్వీకరించాడు.
🔸అపుడు నాకర్థమైందేంటంటే... ఇంట్లో నాన్న అరిచారనీ ఆఫీసులో బాస్ తిట్టారనీ రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువుందనీ నాకు కలిగే చికాకుకీ అసహనానికీ కారణం ఆయా వ్యక్తులూ పరిస్థితులూ కాదనీ ఆ సందర్భంలో చికాకూ కోపం రాకుండా నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాననీ. సమస్య కంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరువల్లే జీవితం గందరగోళం అవుతుందని బొద్దింక ఘటన వల్లే నాకు తెలిసింది.
🔸ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడన్నా శాంతంగా ఉన్నాడన్నా అర్థం అతడికి సమస్యలు లేవని కాదు, ఆ సమస్యలను సరైన వైఖరితో అధిగమించాడు’ అని విశ్లేషించారు. 🔶🍁🔶🍁🔶