Sunday, September 23, 2018

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....* Heart Touching and very valuable 👍

*ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....*

నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి.

1. జీవితం లో అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.

2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.

3.నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుంది.

*ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....*

1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు.
నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.
నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు.
అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేసే ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది.
నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త,  గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!

2. ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు మరియు తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.
ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా,
నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.

3. జీవితం చిన్నది.
ఒక్క రోజు వ్యర్థమైనా ....చక్కగా అనుభవిం చాల్సిన,
మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.

4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన.
కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్.
నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది.
ప్రేమ యొక్క సౌందర్యాన్ని ,
అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు.
ఇవి ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో.

5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు,
కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు.
నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.
దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే,
కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.

7. నువ్వు నీ మాట నిలబెట్టుకో. ఇతరులనుంచి ఏది ఆశించకు.
నువ్వు అందరితో మంచిగా ఉండు,
అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు.
ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే  నీకు అనవసర సమస్యలు తప్పవు.

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక్క చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ కూడా ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.

9. అది ఎంత తక్కువ/ ఎక్కువ కాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!

                                       *........ నాన్న*

Heart Touching and very valuable 👍

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL
TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top