Wednesday, September 12, 2018

People always tries to drag you to their comfort level.

నువ్వేంటన్నది అనవసరం... నీ మెచ్యూరిటీ లెవల్స్ ఏంటన్నది అనవసరం.. అసలు నీ ఉద్దేశాలూ, థాట్ ప్రాసెస్ ఏంటన్నది అనవసరం. People always tries to drag you to their comfort level. Yeah.. ఈ ప్రపంచంలో నిరంతరం నువ్వు జడ్జ్ చెయ్యబడతావు. But one thing, never care anybody. ఏం పోదు, నష్టమేం లేదు. ఎవడి అజ్ఞానానికో, ఎవడి మూర్ఖత్వానికో, ఎవడి జడ్జ్‌మెంట్లకో నిన్ను నువ్వు కోల్పోకు.

వస్తే రానీ.. పోతే పోనీ.. రాజులూ లేరు, రాజ్యాలూ లేవు, తల మీద కిరీటాలూ లేవు.. దమ్మిడీ విలువ లేని సోషల్ స్టేషస్‌లూ అవసరం లేదు. నీ బ్రతుకు నువ్వు దర్జాగా బ్రతుకు. నిజాయితీగా ఉండు.. పనులన్నీ మానేసి ఇతరుల్ని జడ్జ్ చేస్తూ కూర్చునే సమాజాన్ని కాదనుకోవడానికి దమ్ముండాలి.. నీకు నువ్వు బ్రతకడానికి దమ్ముండాలి. అది జీవితాంతం కాపాడుకో. హెడ్ వెయిట్ అంటారు.. ఏటిట్యూడ్ అంటారు.. ఇష్టమొచ్చిన పేర్లు పెట్టుకుంటారు.. కళ్లెగరేసి మరీ... భుజాలు ఎగరేసి మరీ చెవులు కొరుక్కుని మరీ చెప్పుకుంటారు. వెళ్లి గంగలో దూకమను. నష్టమేం లేదు. నీ మనస్సుకి నువ్వు జవాబుదారీగా ఉండు.

లౌక్యం అంటారు.. తెలివితేటలంటారు... అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ స్ట్రేటజీలు రచిస్తారు. ఎవరెవర్నో ఇంప్రెస్ చెయ్యడానికి వాళ్ల ఖర్మ కొద్దీ వాళ్లని వాళ్లు కోల్పోతున్నారు.. చావనీయి.. నీకు అవసరం లేదు ఆ ముళ్ల బ్రతుకు. కష్టపడు... సంతృప్తిగా బ్రతుకు, నిరంతరం పాజిటివ్‌గా బ్రతుకు. ఎవరినీ శత్రువుగా చూడకు.. పనికిమాలిన స్ట్రెస్ బ్రెయిన్ మీద వేసుకోకు. మనస్సు స్వచ్ఛంగా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

అందరి ఇగోలూ శాటిస్‌ఫై చేస్తూ నీ విలువైన టైమ్ వేస్ట్ చేసుకోకు. ఎదురుగా ఉన్న మనిషితో మనస్ఫూర్తిగా గడుపు.. మంచిగా మాట్లాడు. ఆత్మీయంగా ప్రవర్తించు. అంతే తప్పించి వెధవ నటనలు, బిస్కెట్ మాటలు మాట్లాడకు. మంచితనం అనేది గుండె లోతుల్నించి రావాలి, నాలిక మీద నుండి కాదు. వీలైనంత తక్కువగా మనుషులతో ఎమోషనల్‌గా అటాచ్ అవ్వు. చేతనైనంత వరకూ ప్రేమగా ఉండడం.. దూరంగా ఉన్నప్పుడు నీ పనిలో నువ్వు మునిగిపోవడం. ఇంకే అవసరం లేదు. అస్సలు ఇంప్రెస్ చెయ్యాలనుకోకు.. ఎంతమందినని ఇంప్రెస్ చేస్తావు?

ఇదంతా ఓ గేమ్.. నిన్నెవరూ పట్టించుకోపోయినా నష్టమేం లేదు. ఏం బ్రతకలేవా? నువ్వు చచ్చిపోయే వరకూ వీళ్లందరూ నీతో ఉంటారనుకుంటున్నావా? కొంతమంది ఓ పదిరోజులు ఉంటారు.. మరికొంత మంది నెలరోజులు, ఇంకొంతమంది సంవత్సరం, రెండు సంవత్సరాలు.. ఆ తర్వాత ఎవరి ప్రయారిటీలు వారికి మారిపోతాయి. నువ్వు మనుషుల నుండి ఏం expect చేస్తున్నావో, నీ నుండీ మనుషులు చాలానే expect చేస్తారు. ఈ లెక్కలూ, కాలిక్యులేషన్లు మనకు వద్దు. ఉంటే జెన్యూన్‌గా ఉందాం. లేదంటే మనుషులకు దూరంగా మన పని మనం చేసుకుందాం. ఇంట్రావర్ట్, extrovert లాంటి బ్రాండింగ్‌లు పడుతూనే ఉంటాయి. పెట్టుకోనీయి.. ఇష్టమొచ్చిన పేర్లు.. వాళ్ల సైకాలజీ నాలెడ్జ్‌ని ప్రూవ్ చేసుకోవడానికి ఎలాగైనా మనల్ని జడ్జ్ చేయనీయి.. ఫీలవ్వకు. నీ లైఫ్ నీ చేతిలో, నీ మనస్సు నీ కంట్రోల్‌లో పెట్టుకో.

పోనీ, పోనీ.. పోతే పోనీ! సతుల్‌, సుతుల్‌, హితుల్‌ పోనీ. పోతే పోనీ!

రానీ, రానీ... వస్తే రానీ! కష్టాల్‌, నష్టాల్‌,. కోపాల్‌, తాపాల్‌, శాపాల్‌, రానీ! అన్నింటికీ నీ చిరునవ్వే, ప్రశాంత వదనమే సమాధానం కావాలి!

0 comments:

Post a Comment

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

TSWREIS E- TOOL
TS PRC2015

NOTIFICATIONS

TS LATEST UPDATES


Top