Tuesday, October 2, 2018

అక్టోబర్ 2 లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి* ►►జాతి మరచినా.. చరిత్ర మరువని ఏకైక నాయకుడు..!!

*అక్టోబర్ 2 లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి*

►►జాతి మరచినా.. చరిత్ర మరువని ఏకైక నాయకుడు..!!
*****************

వారి గురించి మచ్చుకు కొన్ని విషయాలు..!!
.
అయన వారి వంశంలో పుట్టలేదనో...!!

లేక కండలు తిరిగిన పెద్ద బలమైన శరీరం ఉన్న వ్యక్తి కాదనో..!!

లేక ఆరడుగుల అందగాడు కాదనో..!!

లేక పెద్ద ధవంతుల కుటుంబంలో పుట్టని వ్యక్తి కాదనో..!!

లేక రైల్వేశాఖ మంత్రిగా ఉన్నపుడు ఎక్కడో జరిగిన ఓ రైలు..దుర్ఘటనకు
నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామ చేసిన బాధ్యతగలిగిన మంత్రి అయినందుకో..!!

లేక దేశానికి అన్నం పెట్టే రైతన్న గురించి.. మరియు దేశ రక్షణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి వృత్తి బాద్యతలు నిర్వర్తిస్తున్న సైనికుల గురించి ఆనాడే
ఆలోచించి " *జై జవాన్.. జై కిసాన్"* నినాదంతో ప్రణాళికలు రూపొందించిన జ్ఞాని అయినందుకో..!!

లేక అయన 1965 యుధ్ధం గెలిపించిన వ్యక్తి అయినందుకో..!!

లేక ఆహార ధాన్యాల కొరత ఉందని పెరట్లో నాగలి పట్టి దున్నినందుకో..!!

లేక తన కుటుంబాన్ని వారానికి ఒక రోజు ఉపవాసం ఉంచినందుకో..!!

లేక ప్రధానిగా ఉండి కూడా సొంత Car లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచినందుకో..!!

లేక కేంద్ర Home మంత్రిగా పనిచేసి సొంత Home కూడా లేనందుకో..!!

లేదా ప్రధాని హోదాలో ఉండి కూడా తన కుమారుడు రేషన్ షాపులో నిలబడి నిలబడి కళ్ళు తిరిగి పడిపోయినందుకో..!!

చివరికి అయన ఎలా ఎందుకు మరణించారో కూడా తెలుసుకోకుండా ఆయన శరీరానికి
పోస్టమార్టం కూడా నిర్వహించకుండా దేశానికి తీసుకొచ్చి సమాధి చేసినందుకో..!!
.
ఇలాంటి ఎన్నో కారణాలతో అయన.. ప్రజలకి, పార్టీలకి, ప్రభుత్వాలకి గుర్తులేకపోవడానికి ఎన్నెన్నో చెప్పుకోవచ్చు..!!
.
కాని..
ఆయనకి తెలిసింది ఒక్కటే..
నీతి నిజాయితీగా ప్రజలకి సేవ చెయ్యడం..!!
ఒక్క రూపాయి కూడా వెనకేసుకోకుండా..
తన చివరి నిముషం వరకు దేశానికి సేవ చేస్తూనే చనిపోవడం..!!
.
చరిత్ర తెలిసిన వారు ఎవరైనా..
అయన గురించి చెప్పమంటే "ఒక్క"మాటే చెపుతారు..
.
గాంధీలు అయినా పుడతారేమో కాని...
లాల్ బహుదూర్ లాంటి వ్యక్తి ఈ దేశంలో మళ్ళి పుట్టరు అని..!!
.
ఆ మాట ఎంత గొప్పదో..
అయన వ్యక్తిత్వం అంకితభావం ఏంటో..
ఈ ఒక్క మాటతో అర్ధం చేసుకోవచ్చు..!!
.
*జాతి మరచినా..*
*చరిత్ర మరువని* ఏకైక నాయకుడు అయన..!!
.
*వారికి గొప్ప నివాళి*..!!

మనం మరచిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి!
(పాపం విమానం లో కూడా ఫైల్స్ చూసుకొనే వారు ... అది భార్యా పక్కనే )

అక్టోబర్, 2 అంటే ఒక్క గాంధీ గారి పుట్టినరోజు గా మాత్రమే చాలా మంది గుర్తుపెట్టుకున్నారు.
ఇది ఇంకొక మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా. టి.వి. లు, పేపర్లు ఈ రోజు ఒక్క గాంధీ గారి గురించి మాత్రమే తలచుకుంటాయి. యించుమించు దేశం యావత్తు మరచిపోయినరోజు. కొందరి విషయంలో పునరుక్తి విధానం దోషంకాదు. కాని స్మరించ వలసిన వ్యక్తిని స్మరించకపోవడం నేరం. దురదౄష్టవశాత్తూ మన భారతదేశంలో. ఏది ఏమైనా, మనం మరపురాని రోజుగా గాంధీజయంతిని పండుగగా జరుపుకునే అక్టోబర్ 2 రోజు మనం అదేరోజున మన దేశం మూడవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారి జన్మదినం కూడ అదేరోజు అన్నది మరచిపోయిన రోజు కూడ అదే అన్నది వింత, విడ్డూరం కలిగిస్తాయి.

అల్పకాలంగా ప్రధానిగా సేవలనందించినా, అనల్పమైన నాయకునిగా పేరుప్రఖ్యాతులను పొందారు. విజయం తెచ్చిన విషాదం భారత్-పాకిస్తాన్ మధ్య 1965 లో జరుగుతున్న యుద్ధం సందర్భంగా శాస్త్రి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, ఆ సంకల్పం, దీక్ష, సరిసములు లేని ధీరలక్షణాలు ఆ నాయకునివి.
దేశానికి మూలమూలలకు వ్యాపించిన నినాదం 'జై జవాన్ జై కిసాణ్ అన్నది లాల్ బహదూర్ శాస్త్రిగారి భావనే. ఆ అవాంతర పరిస్థితుల్లో ప్రజలను త్యాగవంతులుగా ముందుకు రావాలని కోరిన

మహానుభావుడు. పాకిస్తాన్ తో అమోఘమైన విజయాన్ని సాధించాడు. ఈ ఆనందం పంచుకునే లోపున, 1966 లో పాకిస్తాన్ తో తాష్కెంట్ లో జరుపుకున్న అంగీకార సమావేశం ఫలితంగా అంగీకారపత్రంపై తన ముద్రని యిచ్చిన వెంటనే, మరణించడం దురదౄష్టకరం.
ఓ శాస్త్రీ సరిలేరు నీ కెవ్వరూ ! శాస్త్రిగారు భారత రాజకీయాల్లో తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు. అందరి మనసును దోచిన విషయాలు - శాస్త్రిగారు ప్రదర్శించిన నీతిపూర్వక నడత, నిరాడంబరత, రికామీ వ్యక్తిత్వం, త్యాగశీలత, శాంతమూర్తి, ధౄఢనిర్ణయకారుడు. ఆయన భౌతికంగా వామనమూర్తి అయినా ఆయన తరానికి మాత్రం నడతలో ఆజానుభాహుడు.
ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి గారి పిలుపు మేరకు ,
తన ఒంటి మీది బంగారం యుద్దనిధికి ఎలా విరాళం గా ఇచ్చేసారో ప్రౌడ్ గా చెప్పుతారు మన మిత్రులు Usharani Nutulapati గారు.

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES