Friday, October 12, 2018

*♦అనుమతి లేని గైర్హాజర్*_ _*(డైస్ నాన్)♦:*_

_*♦అనుమతి లేని గైర్హాజర్*_
_*(డైస్ నాన్)♦:*_

*👉🏽ఉద్యోగులు సంబంధిత అధికారి నుండి ఎలాంటి పూర్వానుమతి లేకుండా, లేక కనీసం సెలవు దరఖాస్తు పెట్టకుండా గర్హాజర్ అయిన కాలాన్ని ఫండమెంటల్ రూల్ FR-18 ప్రకారం డైస్ నాన్(Dies-Non) గా పరిగణిస్తారు.*

*👉🏽డైస్ నాన్ అంటే No work-No pay పని చేయలేదు కాబట్టి జీతం లేదు అని అర్ధం.*

*👉🏽డైస్ నాన్ కాలాన్ని సర్వీస్ బ్రేక్ గా పరిగణించకూడదు.*

*👉🏽కాని అట్టి డైస్ నాన్ కాలము తదుపరి వార్షిక ఇంక్రిమెంటుకు గాని, పెన్షనుకు గాని, సెలవుకు గాని పరిగణలోకి తీసుకోరు.*

👉🏽 *ఉద్యోగిపై CCA రూల్స్-1991 ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి.*

*👉🏽ఒక సంవత్సరం మించి విధులకు గైర్హాజరైన ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించాలని G.O.Ms.No.11 Fin తేది:13.01.2004 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.*

*👉🏽ఒక సంవత్సరం మించి విధులకు గైర్హాజరైన ఉద్యోగి రాజీనామా చేసినట్లు పరిగణించాలని రూలు 18 కి సవరణ ఉత్తర్వులు G.O.Ms.No.128 Fin తేది:1.6.2007 వెలువడ్డాయి.*

*👉🏽పై సందర్భంలో ఉద్యోగిపై చర్యలు తీసుకునేముందు ఆ ఉద్యోగి వాదనను వినిపించుకొనుటకు తగిన అవకాశం ఇవ్వవలెను. Rule 5B & G.O.Ms.No.129 Fin తేది:1.6.2007*

*👉🏽విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ పరిస్థితుల్లో నైనా రాజీనామా చేసిన యెడల A.P.Subordinate Service రూల్స్ 1996 లోని రూలు 39 ప్రకారం. ఆమోదించవచ్చు.*

*👉🏽విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ కారణం చేతనైనా A.P.రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 లోని 43 మరియు 44 మేరకు స్వచ్చంద పదవీ విరమణ చేయదలచుకున్న నిబంధనల మేరకు అనుమతించవచ్చు.*

*👉🏽విధులకు అనుమతి లేకుండా గైర్హాజరైన ఉద్యోగి తిరిగి కొంతకాలం తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో తిరస్కరించకుండా, వెంటనే విధులలో చేర్చుకోవాలి. తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.*
*Govt.Circular.Memo.No.C.9101-4/8/FR-I/91,తేది:25.12.1991*

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top