Tuesday, November 27, 2018

""వెలి బతుకుల తొలి పొద్దు "" మహాత్మా జ్యోతిరావు ఫూలే... *రేపు మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్థంతి* 🙏🙏🙏🙏🙏🙏 'మహత్మా జ్యోతిరావు ఫూలే' గురించి తెలుసుకోవడమంటే ఆధునిక భారతదేశ సామాజిక వ్యవస్థను తెలుసుకోవడమే. భారత దేశంలో 'మహాత్మ' అనే బిరుదాంకితులు ఇద్దరు. ఒకరు జ్యోతిరావు ఫూలే. మరొకరు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. బ్రాహ్మణీయ సంస్కతికి, నిచ్చెనమెట్ల వర్ణ, కుల వ్యవస్థకు ప్రాణం పోసిన ''మనుస్మతి''కి, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు ఫూలే అవిశ్రాంతంగా పోరాటం చేసిండు. మమతానురాగాల మానవీయ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కషి చేసిండు. సైద్ధాంతిక, విద్యా రంగాల్లో ఉద్యమాలను నిర్మించడం, వాటికోసం సంస్థలను నెలకొల్పడం వంటివి చేశాడు. జ్యోతిరావు ఫూలే చేసిన కృషిని, ప్రభావాన్ని చాటిచెప్పేందుకు 1888 మే 11న పూణేలో పెద్ద బహిరంగసభ జరిగింది. వేలాది మంది ప్రజల సమక్షంలో జ్యోతిరావు ఫూలే ''మహాత్మ'' అనే బిరుదుతో సత్కారం పొందిండు. పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు. నడుస్తున్న కాలానికి వ్యాఖ్యానం అక్కర లేదు. కానీ వక్రీకరించబడ్డ చరిత్రకు పునర్‌ నిర్వచనం అవసరం. భారతదేశంలో ఆధిపత్య బ్రాహ్మణీయ సంస్కతి వాస్తవాలను సమాధి చేసింది. అందుకే ''ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథలన్నీ కావాలిప్పుడు''. 1980వ దశకం వరకు 'మహాత్మ' అనగానే చాలామందికి తెలిసింది ''మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ'' మాత్రమే. 'మహాత్మ జ్యోతిరావు ఫూలే'ను తన గురువు అని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ప్రకటించిన విషయాన్నీ వెలుగులోకి రానీయలేదు. ఉద్దేశపూర్వకంగానే బడుగు జన మేధావుల గొప్పతనాన్నీ, నాయకుల విశిష్టతనూ, పోరాటయోధుల చరిత్రనూ కనుమరుగు చేసిండ్రు. కట్టుకథలు చెప్పిండ్రు. జ్యోతిరావు 1827 ఏప్రిల్‌ 11న పూణేలో జన్మించిండు. తల్లి చిమ్నాబాయి, తండ్రి గోవిందరావు. తొమ్మిది నెలల పసిప్రాయంలోనే జ్యోతిరావు తల్లి మరణించింది. గోవిందరావు రెండో పెండ్లి ఆలోచనే చేయలేదు. తల్లి, తండ్రి తానై ఆ పసివాడిని పెంచసాగిండు. కానీ బాలుడిని సాకుడు గోవిందరావుకు కష్టమైంది. అందుకే తన సమీప బంధువైన సగుణాబాయి సాయం కోరిండు. ఆమె బాల్య వితంతువు. చాలా తెలివైంది. కరుణామయురాలు. జ్యోతిరావును కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ బాలుడి చురుకుదనం, తెలివితేటలు సగుణాబాయి గుర్తించింది. బాలుడు వ్యవసాయంలో తనకు తోడుగా ఉండాలని గోవిందరావు అనుకున్నాడు. పట్టుబట్టి జ్యోతిరావును మంచి స్కూళ్లో చేర్పించింది సగుణాబాయి. విద్యాబుద్దులతోపాటు మానవ విలువలు నేర్పింది. మనిషిగా దిద్దితీర్చింది. ఆనాడు శూద్రులకు, అతిశూద్రులకు బ్రాహ్మణాధిపత్య సమాజంలో విద్యార్హత లేదు. కానీ ఇంగ్లీష్‌ పాలకుల ప్రాబల్యంతో శూద్రులకు, అతిశూద్రులకు చదువుకునే అవకాశాలు కలిగినై. గట్ల శూద్రుడైన ఫూలే కూడా ప్రాథమిక విద్యనభ్యసించిండు. చదువు మానేసి తండ్రి గోవిందరావుకు వ్యవసాయంలో సాయం చేస్తున్నడు. అయినా ఫూలేకు చదువు మీద శ్రద్ధాసక్తులు తగ్గలేదు. రాత్రి నిద్రపోయే ముందు లాంతరు వెలుగులో చదువుకునే వాడు. జ్యోతిరావుకు చదువుపట్ల ఉన్న ఆసక్తిని ఒక ముస్లిం టీచర్‌, ఇంటి పక్కనున్న ఒక క్రైస్తవ పెద్దమనిషి గమనించిండ్లు. గోవిందరావును ఒప్పించి జ్యోతిరావు విద్యాభ్యాసం కొనసాగేలా చేసిండ్లు. పూణేలో స్కాటిష్‌ మిషన్‌ నడుపుతున్న స్కూళ్ల 1841లో జ్యోతిరావు చేర్పించిండు. గోవిందరావు తన కొడుకు జ్యోతిరావుకు పెండ్లి చేయాలి అనుకున్నడు. సావిత్రిబాయిని చూసి సరైన జోడి అని సగుణాబాయి భావించింది. 1840లో పెండ్లి అయ్యింది. అప్పుడు జ్యోతిరావుకు పన్నెండు ఏండ్లు. సావిత్రిబాయికి తొమ్మిది ఏండ్లు. ఆ బాలదంపతులిద్దరికీ తల్లి ప్రేమను పంచి సామాజిక విప్లవకారులుగా తీర్చిదిద్దిన మహాసాధ్వి సుగుణాబాయి. ఫూలేకు బాల్యం నుంచే పుస్తక పఠనంపై అమితాసక్తి. ఆంగ్లంలో జాన్‌ స్టుఅర్ట్‌ మిల్‌ రాసిన ''ఆన్‌ లిబర్టీ'' థామస్‌ పైన్‌ రాసిన ''ద రైట్స్‌ ఆఫ్‌ మాన్‌''(మానవ హక్కులు), ''ది ఏజ్‌ ఆఫ్‌ రీజనింగ్‌'' అనే పుస్తకాలు జ్యోతిరావు ఫూలేను చాలా ప్రభావితం చేసినై. ఆ రచనలు ఫూలే మనసులో ఉన్న తిరుగుబాటు తత్వాన్ని తట్టి లేపినై. ఈ పుస్తకాలు ఇచ్చిన స్ఫూర్తితో, శక్తితో, అవగాహనతో ఫూలే భారత సమాజాన్ని నిశితంగా పరిశీలించిండు, విశ్లేషించిండు. భారతదేశంలో చలామణి అవుతున్న బ్రాహ్మణాధిపత్యం, మనుస్మతి, కులవివక్ష జ్యోతిరావుకు చాలా అమానవీయంగా తోచినై. దాంతో భారత సమాజాన్ని సంస్కరించాలన్న ఆలోచన మొదలైంది. శివాజీ జీవిత చరిత్ర, అమెరికా స్వాతంత్య్ర పోరాటం, స్వేచ్ఛ, సమానత్వం వైపు ఆయన ఆలోచనలను మళ్లించినై. 1848లో ఒక బ్రాహ్మణ మిత్రుడు సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ పెండ్లి ఊరేగింపులో జరిగిన అవమానం ఫూలే జీవితాన్ని మలుపు తిప్పింది. 'మాలి' కులస్థుడైన జ్యోతిరావును బ్రాహ్మణులు దుర్భాషలాడిండ్రు. అమానుషంగా కించపరిచిండ్లు. కిందపడేసి కాళ్లతో తన్నిండ్రు. ఆ అవమానాన్ని జ్యోతిరావు తట్టుకోలేకపోయిండు. ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా ఆలోచించిండు. కానీ అది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదనీ, మొత్తం తన జాతికి జరిగిన అవమానమనీ భావించిండు. తన ఆత్మహత్యతో ఆ అవమానం ఆగిపోదని, తాను బతికుండి జాతికి అవమానాలు జరగకుండా ప్రతిఘటించాలని నిర్ధారించుకున్నడు. దాంతో ఈ సమాజాన్ని సంస్కరించడానికి శ్రీకారం చుట్టిండు. గోవిందరావు మొదట కూరగాయల వ్యాపారి. అనంతరం పీష్వాల కాలంలో ఆయన పూల వ్యాపారం చేయడంతో వాళ్ల ఇంటిపేరు ఫూలేగా మారింది. పూర్వం వాళ్లది మహారాష్ట్రలోని సతార జిల్లా కాడ్గాన్‌. ఫూలే ముత్తాత గ్రామ ఉద్యోగిగా పనిచేసిండు. ఆ ఊరి కులకర్ణి అంటే కరణం దురహంకారాన్ని భరించలేకపోయిండు. ఆ దుర్మార్గాన్ని సహించలేదు. ప్రతిఘటించే శక్తీ ఆయనకు లేదు. కానీ ఆ కులకర్ణి కుల దురహంకారాన్ని ఆ ఊరిని వదిలేసిండు. పూణేకు మకాం మార్చిండు. గట్ల అన్యాయాన్నీ, ఆధిపత్యాన్నీ ఎదిరించే గుణం వారసత్వంగా జ్యోతిరావుకు సంక్రమించింది. బ్రాహ్మణాధిపత్య సమాజం 'సరస్వతీదేవిని చదువుల దేవత'గా కొలుస్తున్న దేశంలో మహిళా టీచర్లు లేకపోవుడు విడ్డూరంగా ఉంది కదూ! బ్రాహ్మణాధిపత్యాన్ని తిరస్కరించాలని సామాన్య జనాన్ని ప్రోత్సహించిండు. సమాజంలో సగభాగామైన మహిళలు అభివద్ధి చెందకుండా సమాజం పురోగతి చెందదని ఫూలే నమ్మిండు. అందుకే స్త్రీలు విద్యావంతులు కావాలని భావించిండు. ఇతరులకు ఆదర్శంగా ముందు తన భార్య సావిత్రిని చదివించిండు. సావిత్రిబాయిని 1846 -1847లో అహ్మదాబాద్‌లో టీచర్‌ ట్రైనింగ్‌కు పంపించిండు. ఆమెతోపాటు ఫాతిమా షేక్‌ అనే ముస్లిం మహిళ కూడా శిక్షణ పొందింది. ఫూలే దంపతులు 1848లో తొమ్మిది మందితో దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారభించిండ్రు. సావిత్రికి తోడుగాఉన్న మరో మహిళా టీచర్‌ సగుణాబాయి. ఆమె అండదండలతోనే ఫూలేదంపతులు అనేక సంస్కరణలు చేపట్టిండ్లు. సామాజిక విప్లవానికి బాటలు వేసిండ్రు. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. బాలికలను ముసలివారికి ఇచ్చి పెండ్లి చేయడంతో చాలామంది అమ్మాయిలు వితంతువులుగా జీవితం గడపాల్సి వచ్చేది. కుటుంబంలోని మగవాళ్లు బలత్కరించడంతో అక్రమంగా గర్భావతులు అయ్యేవాళ్లు. ఆ అవమానాన్ని భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్లు. కొందరైతే ఆ అక్రమ సంతానాన్ని హత్యచేసేవాళ్లు. ఇది ఫూలే దంపతులను బాగా కలిచివేసింది. అభాగ్యులు చనిపోవద్దని, అక్రమంగా జన్మించిన శిశువులను చంపోద్దని ఫూలే దంపతులు పిలుపునిచ్చిండ్రు. తమ ఇంట్లో స్వేచ్ఛగా పురుడు పోసుకోవచ్చని, ఆ పిల్లలు వద్దనుకుంటే తమ వద్దే వదిలి వెళొచ్చని ప్రకటించిండ్రు. అట్ల 1872లో ఒక బ్రాహ్మణ యువతికి పుట్టిన బిడ్డనే ఫూలే దంపతులు దత్తపుత్రునిగా స్వీకరించిండ్రు. ఆ బాలునికి యశ్వంతు అని పేరు పెట్టుకున్నరు. యశ్వంతు వైద్యవిద్యను అభ్యసించిండు. వైద్య వత్తిలో స్థిరపడ్డడు. బ్రాహ్మణాధిపత్య చెర నుంచి శూద్రులను కాపాడుడే లక్ష్యంగా మహత్మా జ్యోతిరావు ఫూలే 1873 సెప్టెంబర్‌ 24న సత్యశోధక సమాజాన్ని స్థాపించిండు. భగవంతుడికి భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండొద్దని సత్యశోధక సమాజం పిలుపునిచ్చింది. పురోహితుల అవసరం లేకుండా సభ్యులు దేవుడిని పూజించేవాళ్లు. సత్యశోధక సమాజం అభాగ్యులైన వితంతు వులకు, అనాధ శిశువులకు ఆశ్రయమైంది. కుల, మత, లింగ, ప్రాంత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ సత్యశోధక సమాజంలో సభ్యత్వం కల్పించిండ్రు. వేదాలు పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకించిండు. విగ్రహారాధననూ ఖండించిండు. పూణే పట్టణ పరిపాలనలో భాగమైండు. మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా కూడా సేవలందించిండు. స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యమత్యం, మానవత్వంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించిండు. శూద్రులను, అతిశూద్రులను భావదాస్యం నుంచి విముక్తుల్ని చేయాలని భావించిండు. ప్రగతిశీల భావజాల వ్యాప్తికోసం ఫూలే సాహిత్యాన్ని, పత్రికారంగాన్ని ఎంచుకున్నడు. ''గులాంగిరి'', ''త్రుతీయరత్న'', ''పౌరోహిత్యం బండారం'', " సార్వజనిక సత్యధర్మం'', ''సేద్యగాడి చెర్నాకోల'', ''హెచ్చరిక'' తదితర ఎన్నో గ్రంథాలు రాసి, ప్రచురించిండు. అంతేకాదు ''దీనబంధు'' అనే వారపత్రికను ప్రారంభించిండు. కార్మికుల, కర్షకుల సమస్యలు, బీదల బాధలు, ఇతర సామాజిక సమస్యలెన్నో ఈ పత్రికలో అచ్చయ్యేవి. సామాజిక ప్రజాస్వామ్యం సాధించుడే భారతదేశానికి ముఖ్యమని మహత్తర సందేశం ఇచ్చిన మహాత్మ జ్యోతిరావు ఫూలే తన గురువు అని భారత రాజ్యంగా నిర్మాత డా.బిఆర్‌. అంబేద్కర్‌ ప్రకటించిండు. సమసమాజ స్థాపన కోసం నిరంతరం తపిస్తూ అనారోగ్యంతో ఫూలే 1890 నవంబర్‌ 28న మరణించిండు. కుల వివక్షను ఎదిరించి బహుజనుల బతుకుల్లో వెలుగు రేఖలు ప్రసరింపజేసిన క్రాంతిజ్యోతి. వెట్టి బతుకుల్లో తొలిపొద్దు మహాత్మ జ్యోతిరావు ఫూలేకు జోహార్లు. భారదేశ సామాజిక విప్లవోద్యమంలో, సంఘ సంస్కరణోద్యమంలో మగనితో సమానంగా పోరాడిన సాహస వనిత సావిత్రిబాయికి జోహార్లు. - ప్రొ||ప్రభంజన్‌ యాదవ్‌

""వెలి బతుకుల తొలి పొద్దు ""
                            మహాత్మా జ్యోతిరావు ఫూలే... 

*రేపు మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్థంతి*
      🙏🙏🙏🙏🙏🙏

'మహత్మా జ్యోతిరావు ఫూలే' గురించి తెలుసుకోవడమంటే ఆధునిక భారతదేశ సామాజిక వ్యవస్థను తెలుసుకోవడమే. భారత దేశంలో 'మహాత్మ' అనే బిరుదాంకితులు ఇద్దరు. ఒకరు జ్యోతిరావు ఫూలే. మరొకరు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. బ్రాహ్మణీయ సంస్కతికి, నిచ్చెనమెట్ల వర్ణ, కుల వ్యవస్థకు ప్రాణం పోసిన ''మనుస్మతి''కి, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు ఫూలే అవిశ్రాంతంగా పోరాటం చేసిండు. మమతానురాగాల మానవీయ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కషి చేసిండు. సైద్ధాంతిక, విద్యా రంగాల్లో ఉద్యమాలను నిర్మించడం, వాటికోసం సంస్థలను నెలకొల్పడం వంటివి చేశాడు. జ్యోతిరావు ఫూలే చేసిన కృషిని, ప్రభావాన్ని చాటిచెప్పేందుకు 1888 మే 11న పూణేలో పెద్ద బహిరంగసభ జరిగింది. వేలాది మంది ప్రజల సమక్షంలో జ్యోతిరావు ఫూలే ''మహాత్మ'' అనే బిరుదుతో సత్కారం పొందిండు.

       పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు. నడుస్తున్న కాలానికి వ్యాఖ్యానం అక్కర లేదు. కానీ వక్రీకరించబడ్డ చరిత్రకు పునర్‌ నిర్వచనం అవసరం. భారతదేశంలో ఆధిపత్య బ్రాహ్మణీయ సంస్కతి వాస్తవాలను సమాధి చేసింది. అందుకే ''ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథలన్నీ కావాలిప్పుడు''. 1980వ దశకం వరకు 'మహాత్మ' అనగానే చాలామందికి తెలిసింది ''మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ'' మాత్రమే. 'మహాత్మ జ్యోతిరావు ఫూలే'ను తన గురువు అని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ప్రకటించిన విషయాన్నీ వెలుగులోకి రానీయలేదు. ఉద్దేశపూర్వకంగానే బడుగు జన మేధావుల గొప్పతనాన్నీ, నాయకుల విశిష్టతనూ, పోరాటయోధుల చరిత్రనూ కనుమరుగు చేసిండ్రు. కట్టుకథలు చెప్పిండ్రు.
      జ్యోతిరావు 1827 ఏప్రిల్‌ 11న పూణేలో జన్మించిండు. తల్లి చిమ్నాబాయి, తండ్రి గోవిందరావు. తొమ్మిది నెలల పసిప్రాయంలోనే జ్యోతిరావు తల్లి మరణించింది. గోవిందరావు రెండో పెండ్లి ఆలోచనే చేయలేదు. తల్లి, తండ్రి తానై ఆ పసివాడిని పెంచసాగిండు. కానీ బాలుడిని సాకుడు గోవిందరావుకు కష్టమైంది. అందుకే తన సమీప బంధువైన సగుణాబాయి సాయం కోరిండు. ఆమె బాల్య వితంతువు. చాలా తెలివైంది. కరుణామయురాలు. జ్యోతిరావును కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ బాలుడి చురుకుదనం, తెలివితేటలు సగుణాబాయి గుర్తించింది. బాలుడు వ్యవసాయంలో తనకు తోడుగా ఉండాలని గోవిందరావు అనుకున్నాడు. పట్టుబట్టి జ్యోతిరావును మంచి స్కూళ్లో చేర్పించింది సగుణాబాయి. విద్యాబుద్దులతోపాటు మానవ విలువలు నేర్పింది. మనిషిగా దిద్దితీర్చింది.
ఆనాడు శూద్రులకు, అతిశూద్రులకు బ్రాహ్మణాధిపత్య సమాజంలో విద్యార్హత లేదు. కానీ ఇంగ్లీష్‌ పాలకుల ప్రాబల్యంతో శూద్రులకు, అతిశూద్రులకు చదువుకునే అవకాశాలు కలిగినై. గట్ల శూద్రుడైన ఫూలే కూడా ప్రాథమిక విద్యనభ్యసించిండు. చదువు మానేసి తండ్రి గోవిందరావుకు వ్యవసాయంలో సాయం చేస్తున్నడు. అయినా ఫూలేకు చదువు మీద శ్రద్ధాసక్తులు తగ్గలేదు. రాత్రి నిద్రపోయే ముందు లాంతరు వెలుగులో చదువుకునే వాడు. జ్యోతిరావుకు చదువుపట్ల ఉన్న ఆసక్తిని ఒక ముస్లిం టీచర్‌, ఇంటి పక్కనున్న ఒక క్రైస్తవ పెద్దమనిషి గమనించిండ్లు. గోవిందరావును ఒప్పించి జ్యోతిరావు విద్యాభ్యాసం కొనసాగేలా చేసిండ్లు. పూణేలో స్కాటిష్‌ మిషన్‌ నడుపుతున్న స్కూళ్ల 1841లో జ్యోతిరావు చేర్పించిండు. గోవిందరావు తన కొడుకు జ్యోతిరావుకు పెండ్లి చేయాలి అనుకున్నడు. సావిత్రిబాయిని చూసి సరైన జోడి అని సగుణాబాయి భావించింది. 1840లో పెండ్లి అయ్యింది. అప్పుడు జ్యోతిరావుకు పన్నెండు ఏండ్లు. సావిత్రిబాయికి తొమ్మిది ఏండ్లు. ఆ బాలదంపతులిద్దరికీ తల్లి ప్రేమను పంచి సామాజిక విప్లవకారులుగా తీర్చిదిద్దిన మహాసాధ్వి సుగుణాబాయి.

         ఫూలేకు బాల్యం నుంచే పుస్తక పఠనంపై అమితాసక్తి. ఆంగ్లంలో జాన్‌ స్టుఅర్ట్‌ మిల్‌ రాసిన ''ఆన్‌ లిబర్టీ'' థామస్‌ పైన్‌ రాసిన ''ద రైట్స్‌ ఆఫ్‌ మాన్‌''(మానవ హక్కులు), ''ది ఏజ్‌ ఆఫ్‌ రీజనింగ్‌'' అనే పుస్తకాలు జ్యోతిరావు ఫూలేను చాలా ప్రభావితం చేసినై. ఆ రచనలు ఫూలే మనసులో ఉన్న తిరుగుబాటు తత్వాన్ని తట్టి లేపినై. ఈ పుస్తకాలు ఇచ్చిన స్ఫూర్తితో, శక్తితో, అవగాహనతో ఫూలే భారత సమాజాన్ని నిశితంగా పరిశీలించిండు, విశ్లేషించిండు. భారతదేశంలో చలామణి అవుతున్న బ్రాహ్మణాధిపత్యం, మనుస్మతి, కులవివక్ష జ్యోతిరావుకు చాలా అమానవీయంగా తోచినై. దాంతో భారత సమాజాన్ని సంస్కరించాలన్న ఆలోచన మొదలైంది. శివాజీ జీవిత చరిత్ర, అమెరికా స్వాతంత్య్ర పోరాటం, స్వేచ్ఛ, సమానత్వం వైపు ఆయన ఆలోచనలను మళ్లించినై. 1848లో ఒక బ్రాహ్మణ మిత్రుడు సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ పెండ్లి ఊరేగింపులో జరిగిన అవమానం ఫూలే జీవితాన్ని మలుపు తిప్పింది. 'మాలి' కులస్థుడైన జ్యోతిరావును బ్రాహ్మణులు దుర్భాషలాడిండ్రు. అమానుషంగా కించపరిచిండ్లు. కిందపడేసి కాళ్లతో తన్నిండ్రు. ఆ అవమానాన్ని జ్యోతిరావు తట్టుకోలేకపోయిండు. ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా ఆలోచించిండు. కానీ అది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదనీ, మొత్తం తన జాతికి జరిగిన అవమానమనీ భావించిండు. తన ఆత్మహత్యతో ఆ అవమానం ఆగిపోదని, తాను బతికుండి జాతికి అవమానాలు జరగకుండా ప్రతిఘటించాలని నిర్ధారించుకున్నడు. దాంతో ఈ సమాజాన్ని సంస్కరించడానికి శ్రీకారం చుట్టిండు. గోవిందరావు మొదట కూరగాయల వ్యాపారి. అనంతరం పీష్వాల కాలంలో ఆయన పూల వ్యాపారం చేయడంతో వాళ్ల ఇంటిపేరు ఫూలేగా మారింది. పూర్వం వాళ్లది మహారాష్ట్రలోని సతార జిల్లా కాడ్గాన్‌. ఫూలే ముత్తాత గ్రామ ఉద్యోగిగా పనిచేసిండు. ఆ ఊరి కులకర్ణి అంటే కరణం దురహంకారాన్ని భరించలేకపోయిండు. ఆ దుర్మార్గాన్ని సహించలేదు. ప్రతిఘటించే శక్తీ ఆయనకు లేదు. కానీ ఆ కులకర్ణి కుల దురహంకారాన్ని ఆ ఊరిని వదిలేసిండు. పూణేకు మకాం మార్చిండు. గట్ల అన్యాయాన్నీ, ఆధిపత్యాన్నీ ఎదిరించే గుణం వారసత్వంగా జ్యోతిరావుకు సంక్రమించింది.
        బ్రాహ్మణాధిపత్య సమాజం 'సరస్వతీదేవిని చదువుల దేవత'గా కొలుస్తున్న దేశంలో మహిళా టీచర్లు లేకపోవుడు విడ్డూరంగా ఉంది కదూ! బ్రాహ్మణాధిపత్యాన్ని తిరస్కరించాలని సామాన్య జనాన్ని ప్రోత్సహించిండు. సమాజంలో సగభాగామైన మహిళలు అభివద్ధి చెందకుండా సమాజం పురోగతి చెందదని ఫూలే నమ్మిండు. అందుకే స్త్రీలు విద్యావంతులు కావాలని భావించిండు. ఇతరులకు ఆదర్శంగా ముందు తన భార్య సావిత్రిని చదివించిండు. సావిత్రిబాయిని 1846 -1847లో అహ్మదాబాద్‌లో టీచర్‌ ట్రైనింగ్‌కు పంపించిండు. ఆమెతోపాటు ఫాతిమా షేక్‌ అనే ముస్లిం మహిళ కూడా శిక్షణ పొందింది. ఫూలే దంపతులు 1848లో తొమ్మిది మందితో దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారభించిండ్రు. సావిత్రికి తోడుగాఉన్న మరో మహిళా టీచర్‌ సగుణాబాయి. ఆమె అండదండలతోనే ఫూలేదంపతులు అనేక సంస్కరణలు చేపట్టిండ్లు. సామాజిక విప్లవానికి బాటలు వేసిండ్రు.
          ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. బాలికలను ముసలివారికి ఇచ్చి పెండ్లి చేయడంతో చాలామంది అమ్మాయిలు వితంతువులుగా జీవితం గడపాల్సి వచ్చేది. కుటుంబంలోని మగవాళ్లు బలత్కరించడంతో అక్రమంగా గర్భావతులు అయ్యేవాళ్లు. ఆ అవమానాన్ని భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్లు. కొందరైతే ఆ అక్రమ సంతానాన్ని హత్యచేసేవాళ్లు. ఇది ఫూలే దంపతులను బాగా కలిచివేసింది. అభాగ్యులు చనిపోవద్దని, అక్రమంగా జన్మించిన శిశువులను చంపోద్దని ఫూలే దంపతులు పిలుపునిచ్చిండ్రు. తమ ఇంట్లో స్వేచ్ఛగా పురుడు పోసుకోవచ్చని, ఆ పిల్లలు వద్దనుకుంటే తమ వద్దే వదిలి వెళొచ్చని ప్రకటించిండ్రు. అట్ల 1872లో ఒక బ్రాహ్మణ యువతికి పుట్టిన బిడ్డనే ఫూలే దంపతులు దత్తపుత్రునిగా స్వీకరించిండ్రు. ఆ బాలునికి యశ్వంతు అని పేరు పెట్టుకున్నరు. యశ్వంతు వైద్యవిద్యను అభ్యసించిండు. వైద్య వత్తిలో స్థిరపడ్డడు.
బ్రాహ్మణాధిపత్య చెర నుంచి శూద్రులను కాపాడుడే లక్ష్యంగా మహత్మా జ్యోతిరావు ఫూలే 1873 సెప్టెంబర్‌ 24న సత్యశోధక సమాజాన్ని స్థాపించిండు. భగవంతుడికి భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండొద్దని సత్యశోధక సమాజం పిలుపునిచ్చింది. పురోహితుల అవసరం లేకుండా సభ్యులు దేవుడిని పూజించేవాళ్లు. సత్యశోధక సమాజం అభాగ్యులైన వితంతు వులకు, అనాధ శిశువులకు ఆశ్రయమైంది. కుల, మత, లింగ, ప్రాంత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ సత్యశోధక సమాజంలో సభ్యత్వం కల్పించిండ్రు. వేదాలు పవిత్రంగా భావించడాన్ని ఫూలే వ్యతిరేకించిండు. విగ్రహారాధననూ ఖండించిండు. పూణే పట్టణ పరిపాలనలో భాగమైండు. మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా కూడా సేవలందించిండు. స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యమత్యం, మానవత్వంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించిండు. శూద్రులను, అతిశూద్రులను భావదాస్యం నుంచి విముక్తుల్ని చేయాలని భావించిండు. ప్రగతిశీల భావజాల వ్యాప్తికోసం ఫూలే సాహిత్యాన్ని, పత్రికారంగాన్ని ఎంచుకున్నడు.
''గులాంగిరి'',
''త్రుతీయరత్న'',
''పౌరోహిత్యం బండారం'',
" సార్వజనిక సత్యధర్మం'',
''సేద్యగాడి చెర్నాకోల'',
''హెచ్చరిక''
              తదితర ఎన్నో గ్రంథాలు రాసి, ప్రచురించిండు. అంతేకాదు ''దీనబంధు'' అనే వారపత్రికను ప్రారంభించిండు. కార్మికుల, కర్షకుల సమస్యలు, బీదల బాధలు, ఇతర సామాజిక సమస్యలెన్నో ఈ పత్రికలో అచ్చయ్యేవి. సామాజిక ప్రజాస్వామ్యం సాధించుడే భారతదేశానికి ముఖ్యమని మహత్తర సందేశం ఇచ్చిన మహాత్మ జ్యోతిరావు ఫూలే తన గురువు అని భారత రాజ్యంగా నిర్మాత డా.బిఆర్‌. అంబేద్కర్‌ ప్రకటించిండు. సమసమాజ స్థాపన కోసం నిరంతరం తపిస్తూ అనారోగ్యంతో ఫూలే 1890 నవంబర్‌ 28న మరణించిండు. కుల వివక్షను ఎదిరించి బహుజనుల బతుకుల్లో వెలుగు రేఖలు ప్రసరింపజేసిన క్రాంతిజ్యోతి. వెట్టి బతుకుల్లో తొలిపొద్దు మహాత్మ జ్యోతిరావు ఫూలేకు జోహార్లు. భారదేశ సామాజిక విప్లవోద్యమంలో, సంఘ సంస్కరణోద్యమంలో మగనితో సమానంగా పోరాడిన సాహస వనిత సావిత్రిబాయికి జోహార్లు.

- ప్రొ||ప్రభంజన్‌ యాదవ్‌

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES