Search This Blog

Thursday, December 20, 2018

SAA* *తెలియదు... తెలుసుకోవు.. చెప్తే, వినవా!?

*🌍SAA*
*తెలియదు... తెలుసుకోవు.. చెప్తే, వినవా!?*

       ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర అధికారులకు లీవ్ రూల్స్ పై లోతైన అవగాహన లేకపోయినా ఫర్వాలేదు కానీ, తనకు ఖచ్చితంగా తెలియని లేదా భిన్నాభిప్రాయం బలంగా వ్యక్తమైన సందర్భాల్లో ... విజ్ఞులతో మాట్లాడి... చర్చించి... రూఢీ పర్చుకొని అమలుచేస్తే... ఉద్యోగులకు నష్టం జరగదు. భవిష్యత్తులో...  ఫిర్యాదు వెళ్లి... విచారణ జరిగినా ... తనకూ ఇబ్బంది రాదు. అలాకాకుండా, తనకు తెల్సిందే రూలు... ఎవరితోనూ మాట్లాడను... ఎవరు చెప్పినా విన’నని మొండిగా ప్రవర్తిస్తే... సంబంధిత అధికారి.... సమస్యలను కొనితెచ్చుకున్నట్టే! ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానంటే... ఈమధ్య పలువురు ఉపాధ్యాయులు ఫోన్ చేసి... వివిధ అంశాలకు సంబంధించి రూల్ పొజిషన్స్ అడిగితే చెప్పాను.

*వాళ్ళ హెడ్మాస్టర్లు, ఎంఈవోలు రూల్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్తూ....  చాలా బాధపడ్డారు. ఇంతకూ...  ఆ టీచర్లు ఏమన్నారంటే..,?*
   
       “ఈనెల 6, 7 తేదీల్లో నేను ఎన్నికల విధులు నిర్వహించాను. 8, 9 తేదీలు రెండవ శనివారం, ఆదివారం. 10వ తేదీ నాడు CL కోరుతూ వినతి పత్రం సమర్పిస్తే... ఎలక్షన్ డ్యూటీ చేశాక... విధిగా స్కూల్ కి రావాలని... CL మంజూరు చేయడానికి వీలులేదని... అంతగా అవసరమైతే... ఆకస్మికేతర సెలవు (మెడికల్ లీవ్ etc అన్నమాట) పెట్టుకోవాలని HM సూచించారని” చెప్పి... మా హెచ్ఎం వాదన కరెక్టేనా సర్? అని అడిగారు. సదరు HM చేస్తున్న వాదన నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అది అధికారికంగా అప్పగించిన డ్యూటీ. ఎక్కడ నిర్వహించినా డ్యూటీ... డ్యూటీయే! ఎన్నికల విధులు Other Duty (OD) కిందికి వస్తాయే కానీ, లీవ్ కిందికి రావనే ఇంగితం కూడా తెలియని వారిని చూసి జాలి పడాల్సిందే! కనీస అవగాహన కూడా లేకపోతే ఎలా? ODపై వెళ్లిన వారు... CL పెట్టరాదని కానీ... తిరిగి కార్యాలయం/స్కూలుకే హాజరు కావాలని కానీ లీవ్ రూల్స్ లో ఎక్కడా లేదు. ODపై వెళ్లిన వారు.. దానికి కంటిన్యూగా CL నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు! కాకపొతే, వారికి TA చెల్లించిన పక్షంలో... డౌన్ TAని వాపసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని హెచ్ఎంకు వివరించాలని చెప్పాను. అయితే, ఆ హెచ్ఎం ససేమిరా అంటున్నాడని ... ఎంత చెప్పినా వినడం లేదని వాపోయారు.

        ఆర్నెల్లు మెటర్నిటీ లీవ్ పెట్టిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ టీచరుకు... 27 కాజువల్ లీవులను ఇవ్వనని... దామాషా ప్రకారమే ఇస్తానని వాళ్ళ ఎంఈఓ అంటున్నాట్ట! అది తప్పు. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరం మాత్రమే కాజువల్ లీవులను ప్రపోర్షనేట్లో మంజూరు చేయాలి. మిగతా సందర్భాల్లో కాజువల్ లీవుల్లో ఎలాంటి కోతా పెట్టకూడదు.

          ఇక  ఓ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్ ఎన్నికల విధులు నిర్వహించి... ఈనెల 10 నుంచి 17 వరకు... 8 రోజులు CL పెట్టి, 18 నాడు స్కూలుకు వెళ్లారు.

తీరా.. హెచ్ఎం బాధ్యతలు నిర్వహిస్తున్న సారు  ... ఎన్నికల డ్యూటీకి హాజరైన రెండు రోజులను కూడా కలుపుకొని... 12 రోజులైంది కాబట్టి, CL ఇవ్వరాదు. మెడికల్ లీవ్ పెట్టుకోవాలని అంటున్నారని చెప్తూ... మా హెచ్ఎం చెప్తున్నది కరెక్టేనా? అని అడిగారు. సదరు హెచ్ఎం చెప్తున్నది బ్లండర్! ఎన్నికల డ్యూటీ పీరియడ్ తర్వాత రోజు నుంచే...  పది రోజులు అయినాయా? కాలేదా? అని లెక్కించాలి గాని, OD కలుపుకొని పది రోజులు దాటిందని చెప్పడం దారుణం! విషయాన్ని వివరిద్దామనుకుంటే... ఫోన్లో మాట్లాడటానికి సారు గారు నిరాకరించడం హేమిటో? దీన్ని అజ్ఞానమనాలా? అహంకారమనాలా? ఇలాంటి సారు గార్లకు మళ్ళీ చెప్తున్నా! నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేయడం ఎంత తప్పో... అన్నీ రూల్స్ ప్రకారమే ఉన్నా...  ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, రాయితీలు ఇవ్వడానికి నిరాకరించడమూ అంతే తప్పు. రెండో దానికీ శిక్షలుంటయ్!

*తస్మాత్ జాగ్రత్త!*

SCIENCE VIDEOS

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES