Saturday, December 29, 2018

సందేహాలు - సమాధానాలు* (Voluntary Retirement - Pension)


           *సందేహాలు - సమాధానాలు*
   (Voluntary Retirement - Pension)
_______________________________

1.  ప్రశ్న:
*వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?*

*జవాబు:*
*వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా DEO కు, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు, రెసిడెన్సియల్ స్కూల్స్ స్టాప్ ప్రిన్సిపాల్ ద్వారా సెకరెట్రికి ఏ తేదీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ  నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.*

                      °°°°°
2. ప్రశ్న:
*వాలంటరీ రిటైర్మెంట్ ఏయే కారణాలపై తీసుకోవచ్చు?*

*జవాబు:*
*వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.*

                          °°°°°
3. ప్రశ్న:
*ఒక టీచరుకు అక్టోబర్ 2018 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?*

*జవాబు:*
*20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే వాలంటరీ రిటైర్మెంట్ కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.*

                      °°°°°
4. ప్రశ్న:
*ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?*

*జవాబు:*
*క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.*

                    °°°°°
5. ప్రశ్న:
*Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ కి దరఖాస్తు చేయవచ్చా?*

*జవాబు:*
*చేయవచ్చు.*

                      °°°°°
6. ప్రశ్న:
*Medical Leave లో ఉండి,  స్కూల్లో జాయిన్ అయ్యాకే వాలంటీర్ రిటైర్మెంట్ కి అప్లై చేయాలా? సెలవులో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం ప్రయోజనమా?*

*జవాబు:*
*సెలవులో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది.*

                     °°°°°
7. ప్రశ్న:
*అక్టోబర్ 2018 నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కొత్త PRC వర్తిస్తుందా?*

*జవాబు:*
*తెలంగాణాలో 2వ PRC.... ఫస్ట్ జులై, 2018 నుంచి అమల్లోకి రావాల్సి వుంది. వస్తుందనే నమ్మకమూ నాకుంది. అయితే... నోషనలా? మానిటరీ బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం!*

                        °°°°°
8. ప్రశ్న:
*వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత GIS కంటిన్యూ చేయవచ్చా? GIS అమౌంట్ ఎంత వస్తుంది?*

*జవాబు:*
*వాలంటరీ రిటైర్మెంట్ తరువాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.*

                        °°°°°
9. ప్రశ్న:
*20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?*

*జవాబు:*
*వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది. అలా కాకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే...*

*నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్*
*20>37.87% (చివరి మూలవేతనంలో)*
*21>39.4%*
*22>40.9%*
*23>42.4%*
*24>43.93%*
*25>45.45%*
*26>46.97%*
*27>48.48%*
*28>50%*
*(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ కూడ వర్తిస్తుంది...*
       _________________
.

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top