Saturday, January 12, 2019

శీర్షిక: భారతీయ ఆధ్యాత్మికుడు

శీర్షిక: భారతీయ ఆధ్యాత్మికుడు    

నరేంద్రుడుగా పుట్టాడు
వివేకానందుడు ఎదిగాడు

భారతీయ ఆధ్యాత్మికతను కొత్తగా నిర్మించినవాడు
దాని కోసం నిత్యం పరితపించినవాడు

సమాజానికి మార్గనిర్దేశం చేసినవాడు
యువతను మేల్కొల్పినవాడు

కాలక్షేపం కోసం కాసింత కాలం వెచ్చించనివాడు
వివేకుడుగా ఎదిగినవాడు

ఆయన మాట సూటి
ఆయన బాట మేటి

డబ్బుల కోసం తపన చెందనివాడు
చెడుదారి పట్టిన యువతకు మార్గం చూపినవాడు

భారతీయ ఆధ్యాత్మికుడు
తరతరాల తరగని స్వాప్నికుడు

జాతికోసం కోసం కలలుకన్న కాషాయవాది
కాషాయం కోసమే బతుకును మోసినవాది

బతుకు సమరమంతా ఆధ్యాత్మికమయం
ఆధ్యాత్మికతే హృదయ దైవమయం

అక్షర ఆకాశం ఆయన
ఆకాశంలో నక్షత్రం ఈయన

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top