*_వార్షిక ఇంక్రిమెంటు మంజూరు కోసం దరఖాస్తు చేయాలా?_*
ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఏటా ఇంక్రిమెంటు మంజూరు చేస్తారు. వార్షిక ఇంక్రిమెంట్ల మంజూరుపై ప్రభుత్వ నిబంధనలను ఉద్యోగ, ఉపాధ్యాయుల అవగాహన కోసం..
🔹వార్షిక ఇంక్రిమెంటు పొందడం ఉద్యోగ,ఉపాధ్యాయుల హక్కు. నిలిపి వేయకపోతే 12 నెలల తర్వాత ఇంక్రిమెంటు విధిగా మంజూరు చేయాలి.
🔹వార్షిక ఇంక్రిమెంటు మంజూరు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు తేదీ నా డి డి ఓ లే
ఇంక్రిమెంటు ధ్రువ పత్రంపై సంతకం చేయాలని ఎఫ్ ఆర్ 24 నిర్దేశిస్తోంది.
🔹తన నియంత్రణలో పనిచేసే ఏ ఉద్యోగి ఇంక్రిమెంటు ఏ నెలలో ఉన్నదో గమనించేందుకు ఇంక్రిమెంటు మంజూరు అధికారులే ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ నిర్వహించాలి.
🔹నెల మధ్యలో ఉన్న ఇంక్రిమెంటు తేదీని ఆ నెల మొదటి తేదీకి మార్చాలి. ఆర్ధిక ప్రయోజనాలను సైతం మొదటి తేదీ నుంచే చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర నెంబర్ 133 తేదీ:13-5- 1974 మరియు ప్రభుత్వ ఉత్తర నెంబర్ : 1654/హెచ్1/ 77-1 తేదీ: 13- 5 -1977 సూచిస్తున్నాయి.
🔹వేతన నష్టపు అసాధారణ సెలవు కారణంగా వార్షిక ఇంక్రిమెంటు తేదీ క్రమబద్దీకరించి, నెల మధ్యలో వచ్చినా.. ఆనెల మొదటి తేదీ నుంచే చెల్లించాలి..
🔹గర్భస్రావం, ప్రసూతి సెలవులు సహా ఏ రకమైన సెలవు మధ్యలో ఇంక్రిమెంటుకు అవసరమైన 12 నెలల కాలం పూర్తయితే.. సెలవు నుంచి వచ్చి విధుల్లో చేరిన తేదీ నుంచే ఇంక్రిమెంటు ఆర్థిక ప్రయోజనం చెల్లించాలని మెమో నెం:49643-ఎ/2111/ఎఫ్.ఆర్2/74-1,తేది:6-10-1974 నిర్థేశిస్తోందో.
🔹ఉద్యోగి ప్రవర్తన సక్రమంగా లేకున్నా,సంతృప్తికరంగా విధులు నిర్వహించకున్నా సిసిఎ నిబంధనలు 1991 ప్రకారం సెలవు నిలుపుదల చేస్తారు.
🔹నాన్ క్యములేటీవ్ ప్రభావంతో ఇంక్రిమెంట్లను నిలిపివేస్తే శిక్షాకాలం పూర్తి చేసిన తర్వాత వాటన్నంటిని ఒకేసారి మంజూరు చేస్తారు.అయితే ఆ కాలానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనం లభించదు.క్యుములేటివ్ ప్రభావంతో నిలుపుదల చేస్తే.. సదరు ఇంక్రిమెంట్లు శాశ్వతంగా మంజూరు కావు.