.
*✅ కరువు భత్యం D.A. / D.R. నిర్ణయింపబడు విధానం*
✳️ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం ను D.A ( Dearness Allowance) అనీ,
రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యాన్ని D.R. (Dearness Relief) అని అంటారు.
✳️ అయితే ఈ కరువు భత్యం రేట్లు ఆయా సమయాలలో పెరిగిన ధరల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వంచే నిర్ణయించబడతాయి. కేంద్రము ప్రకటించే కరువు భత్యం రేట్లు ఆధారంగా మన రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యం రేట్లను సవరించి మంజూరు చేస్తుంది.
✳️ 1/1/2006 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారము, మరియు 1/7/2013 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవ PRC ప్రకారము వేతన స్కేళ్ళు అమలు చేయబడుచున్నవి.
✳️ 1.7.2013 నుండి దిగువ తెలిపిన విధముగా DA కన్వర్షన్ ఫార్ములా ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము కరువుభత్యం ప్రకటించుచున్నది.
✳️ *1.1.2006* నాటికి అఖిలభారత వినియోగదారుల ధరల సూచిక పన్నెండు నెలల సగటు *536 పాయింట్లు* ( మూల సంవత్సరము 1982 = 100 ).
✳️ *1.7.2013* నాటికి అఖిలభారత వినియోగదారుల ధరల సూచిక పన్నెండు నెలల సగటు *1022 పాయింట్లు*
✳️ *536/1022* = *0.524*
👉 ఈ కన్వర్షన్ ఫార్ములా ప్రకారము కేంద్ర ప్రభుత్వం ప్రకటించు ప్రతి *ఒక శాతమునకు రాష్ట్ర ప్రభుత్వం 1.1.2014 నుండి 0.524%* చొప్పున ప్రకటించుచున్నది
*🔹ఉదాహరణలు* :-
👉1.7.2015 న కేంద్ర ప్రభుత్వం ఆరు శాతము DA ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం *3.144%* ( 6 × 0.524) DA ప్రకటించినది.
👉1.1.2016 న కూడా కేంద్ర ప్రభుత్వం 6వ సి పి సి ప్రకారం ఆరు శాతము DA ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం *3.144%* ( 6 × 0.524) DA ప్రకటించినది.
👉1.7.2016 న కూడా కేంద్ర ప్రభుత్వం 6వ సి పి సి ప్రకారం 7 శాతము DA ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం *3.668%* ( 7 × 0.524) DA ప్రకటించినది.
👉1.1.2017 న కూడా కేంద్ర ప్రభుత్వం 6వ సి పి సి ప్రకారం 4 శాతము డి.ఏ ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం *2.096%* ( 4 × 0.524) DA ప్రకటించినది.
అయితే 1.1.2016 నుండి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 7వ సి.పి.సి ప్రకారము వేతన స్కేళ్ళు మంజూరు చేయుచున్నందున DA కన్వర్షన్ మారవలసి ఉన్నది.
01.01.2016 నాటికి అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక 12 నెలల సగటు 1210m పాయింట్లు (మూల సంవత్సరం 1982 = 100).
*1210/1022 = 1.184.*
కావున కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతి 1% DA కు రాష్ట్ర ప్రభుత్వం 1.184% చొప్పున ప్రకటించవలసి ఉంటుంది.
*💠DA రేటు*
*👉ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు పొందుతున్న DA.. 33.536% (Jan.2019 నాటిది) నవంబర్ 2019లో ప్రకటించారు.*
👉23/10/2020 రోజున ప్రకటించింది *జులై 2019 నుండి రావాల్సిన DA..*
👉(జులై 2019లో కేంద్ర 7వ PRC ప్రకారం 5% DA పెంపుదల, 6వ PRC ప్రకారం 10% గా ఉంది.. అనగా తెలంగాణ ఉద్యోగులు పొందే DA 10 × 0.524 = 5.240%)
*👉అనగా అప్పటివరకు గల మొత్తం DA..*
*33.536 + 5.240 = 38.776%*
*>>>> <<<<*
_*💥 ఇంకా పొందాల్సిన DA లు ఇలా..*_
1. *జనవరి 2020 నుండి రావాల్సిన DA..*
👉(జనవరి 2020లో కేంద్ర 7వ PRC ప్రకారం 4% DA పెంపుదల, 6వ PRC ప్రకారం 10% గా ఉంది.. అనగా తెలంగాణ ఉద్యోగులు పొందే DA 10 × 0.524 = 5.240%)
👉అప్పటివరకు గల మొత్తం DA..
38.776 + 5.240 = 44.016%
👉2. *జులై 2020 నుండి రావాల్సిన DA..*
(జులై 2020లో కేంద్ర 7వ PRC ప్రకారం 3% DA పెంపుదలగా ఉండబోతుంది, 6వ PRC ప్రకారం 8%గా ఉండబోతుంది.. అనగా తెలంగాణ ఉద్యోగులు పొందే DA : 8 × 0.524 = 4.192%)
👉ఇప్పటివరకు తెలంగాణా ఉద్యోగులకు తాజాగా గల మొత్తం DA..
44.016 + 4.192 = 48.208%
*♦️గమనిక: జనవరి 2020 నుంచి రావాల్సిన రెండు DAలు (అనగా 7%) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు on hold లో ఉంచబడినవి.*
#♦️తెలంగాణ ఉద్యోగులకు జులై 2018 DA తో కలుపుకుని ఉన్న 30.392% ప్రస్తుత PRC చివరి DA గా ఉంటుంది..
#♦️తదుపరి 4 DA లు అనగా ప్రస్తుతం మనం పొందుతున్న (జనవరి 2019) DA మరియు ఇప్పుడు వచ్చిన DA 5.240% (జులై 2019) మరియు రావాల్సిన 2 (జనవరి 2020, జులై 2020) DAలు మరో PRC లో కొత్త DA లుగా ఉంటాయి.
*________S. G________*
.