Search This Blog

Thursday, February 18, 2016

బట్టీ చదువులకు ఇక చెల్లు..

  Increase Font Size Reset Font Size decrease Font size   
రాష్ట్రంలో విద్యావిధానం మారుతోంది. ప్రైవేటు తరహాలో సెంట్రల్ సిలబస్‌కు దీటుగా అచ్చ తెలుగులోనే బోధన జరుగుతోంది. ఆంగ్ల మాధ్యమంలోని విధానాల మాదిరిగా మన రాష్ట్రంలో విద్యాబోధన తీరును మార్చి ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల ఆలోచనలకు రూపం ఇవ్వాలని, ప్రాజెక్టు వర్క్‌తో పనివిధానం నేర్పించాలని విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలు కొంతమేరకు ఫలితాలనిస్తున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న పరీక్షల విధానానికి స్వస్తి పలికారు. విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కొత్త పద్ధతులను విద్యాశాఖ అమలు చేస్తోంది. నూతన విధానం విద్యార్థులకు పరీక్షలంటే భయాన్ని పోగొడుతోంది. బట్టీ పట్టే చదువులకు స్టాప్ పెడుతోంది.


ఒకటి నుంచి పదో తరగతి వరకు గత విద్యా సంవత్సరం వరకు ఏడు సార్లు పరీక్షలు నిర్వహించేవారు. నెలకు ఒకసారి చొప్పున నాలుగు సార్లు నెలసరి పరీక్షలు నిర్వహించేవారు. త్రైమాసిక, అర్ధమాసిక, వార్షిక పరీక్షల్లో పూర్తి గా ప్రశ్నలకు సమాధానాలు రాసే విధానం ఉండేది. కొత్త విధానంలో సెంట్రల్ సిలబస్ పద్ధతిని ప్రవేశపెట్టారు. 

బట్ట్టీ విధానానికి స్వస్తి పలికి, ప్రశ్నకు విద్యార్థి సొంత ఆలోచనతో సమాధానం రాయాలి. దీనివల్ల విద్యార్థిలో ఆలోచన విధానం పెరగనుంది. సొంతంగా ఆలోచించి, దానికి అక్షరరూపం ఇవ్వడంతో విద్యార్థి మరింత మెరుగైన సామ ర్ధ్యం సాధిస్తాడు. కొత్తగా ప్రవేశపెట్టిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో టీచర్ ప్రతి విద్యార్థిని పూర్తిస్థాయిలో గమనించాల్సి ఉంటుంది. కొత్త పద్ధతిలో ఫార్మెటివ్ 1,2,3,4 పరీక్షలు ఉంటాయి. విద్యార్థికి పరీక్ష రాయాలనే టెన్షన్ లేకుండానే వాటి ని నిర్వహిస్తారు. తర్వాత రెండుసార్లు సమ్మేటివ్ 1,2లు అక్టోబర్, మార్చిలో నిర్వహిస్తారు. వీటిలో విద్యార్థి రాసే పరీక్షకు 80శాతం మార్కులు వేస్తారు. మరో 20శాతం మార్కులను ప్రాజెక్టు వర్కు, వైవా వంటి వాటికి కేటాయిస్తారు.

తల్లిదండ్రుల సమావేశాలు... 


పాఠశాలకు వచ్చే విద్యార్థి తీరును తల్లిదండ్రులకు వివరించేందుకు పరీక్ష నిర్వహించిన ప్రతిసారి తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తరగతి ఉపాధ్యాయుడు విద్యార్థి తండ్రి లేదా తల్లికి అతని పరిస్థితిని వివరిస్తారు. విద్యార్థి పరీక్షలో రాసిన జవాబు పత్రాలను చూపించి గతానికి ప్రస్తుతానికి తేడాను చూపిస్తారు. సమావేశానికి రాకపోతే విద్యార్థి చేత జవాబు పత్రాలను ఇంటికి పంపించి వాటిపై సంతకాలు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఆదేశిస్తున్నారు. 

జవాబు పత్రాలను పరిశీలించడంతో విద్యార్థి సామర్థ్యాన్ని తల్లిదండ్రులు అంచనా వేసుకునే అవకాశం గతంలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ఉండేది. కొత్త విధానంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైతం అందుబాటులోకి వచ్చింది.

వికలాంగులకు ప్రత్యేక బోధన


తరగతి గదిలో ఉండే వికలాంగులు, మానసిక వికలాంగులకు తోటి విద్యార్థులతో పాటు ప్రత్యేక బోధన ఉంటుం ది. చెవిటి, మూగ, మాన సిక విద్యార్థులను ముందుగానే గుర్తించి ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యే విధంగా బోధించాలి. దీనికోసం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగ తులను నిర్వహిస్తున్నారు. అంగవైకల్యం చదువుకు అడ్డు కాదని, వారికి అవగాహన కల్పించడానికి జిల్లాలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేసి శిక్షణా కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు. 

హాజరు శాతంతో సంబంధం లేదు


కొత్త విద్యా విధానంలో విద్యార్థి హాజరు శాతంతో పెద్దగా సంబంధం లేదు. విద్యార్థి పాఠశాలకు వచ్చినప్పుడు వయస్సు ఆధారం గా తరగతిని కేటాయిస్తారు. పరీక్షలకు పది రోజుల ముందు వచ్చినా ఆనుమతించేలా ఆదేశాలు ఉన్నాయి. అన్ని అంశాలపై విద్యార్థికి అవగాహన కల్పించి విద్యార్థి పరిస్థితిని అంచనా వేసి మార్కులు వేసే అవకాశం ఉంది.

అదనంగా నాలుగు కొత్త సబ్జెక్టులు 


ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాత సబ్జెక్టులకు తోడుగా మరో నాలుగు సబ్జెక్టు లు పెంచారు. పెంచిన సబ్జెక్టులు కంప్యూటర్, జీవన విధానం, గ్రంథ పఠనం, పని అనుభవం. ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు వీటిని ఉపాధ్యాయులే విద్యార్థి ఆసక్తిని అంచనా వేసి మార్కులు వేస్తారు. 9,10 తరగతుల్లో పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రాజెక్టు వర్క్ తదితరాలను క్షుణంగా పరిశీలించి మార్కులు ఇస్తారు. ప్రస్తుత సమాజంలో కంప్యూటర్ వినియోగం పెరిగినందున 6వ తరగతి నుంచే ప్రైవేటు పాఠశాలల మాదిరిగా కంప్యూటర్ విద్య అందిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పచ్చదనం, ఒకరికి సహాయం చేయడం వంటి వాటిని జీవన విధానం కింద పరిగణిస్తారు. ఉపాధ్యాయులు ఇచ్చే ప్రాజెక్టు వర్క్ పనితీరుకు, పని అనుభవం కింద మార్కులు కేటాయిస్తారు.

SCIENCE VIDEOS

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES