Search This Blog

Friday, July 10, 2020

గతం గుర్తు చేసుకోని వాళ్లు!చరిత్రను నెమరు వేసుకొని వాళ్ళు!! సహాయం చేసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలపని వాళ్లు!! వర్ధమానాన్ని నుండి భవిష్యత్తుకు చరిత్ర నిర్మాణకులు కాలేరు!!
మిత్రులారా!

*కాంట్రాక్టు ఉపాధ్యాయుల పాలిటి ఆరాధ్యదైవం రాజశేఖరుడు*

గతం గుర్తు చేసుకోని వాళ్లు!చరిత్రను నెమరు  వేసుకొని వాళ్ళు!! సహాయం చేసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలపని వాళ్లు!! వర్ధమానాన్ని నుండి భవిష్యత్తుకు చరిత్ర  నిర్మాణకులు కాలేరు!!

ఆ సందర్భంగా గతం ఒక్కసారి మీతో!!

మిత్రుడు వెంకటరెడ్డి మరియు గోపాల్ గార్ల పొస్టింగ్ తర్వాత అప్పటి కాంట్రాక్టు మిత్రుల వ్యధ ను మీతో పంచుకొలనిపించి.....

దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా (జులై 8)...

గిర్రున తిరిగిన కాల చక్రంలో౼గిర గిర,బిరా బిరా అలుపు ఎరుగని ఎన్నో ప్రయాణాలు౼రాత్రి 11.45 సీబీస్ లో బయలు దేరి 3 గంటలకు అచంపేట్ చేరి౼ఉదయం 5 గంటలకు విధి నిర్వహణ ౼   ఎంతో మంది మంత్రులకు,అధికారులకు వినతి పత్రాల సమర్పణ౼కోర్టుల చుట్టూ ప్రదక్షిణ౼అధికారుల ఆదరణకు ఆరాటం౼సమ్మెల నోటీసులు ౼గిరాక్స్ సెంటర్లో గంటల కొలది నిరీక్షణ౼ల్యాండ్ ఫోన్ డబ్బా దగ్గర శుభ వార్తా సమాచారం కొరకు రాత్రి 12 గంటల వరకు ఎదిరిచూపులు౼ కరపత్రాల తయారుకు ఎన్నో కాగితాల చింపివేత౼ *ఆరోపణలు, ప్రత్యారోపణలు*౼ఇలా ఎన్ని జ్ఞాపకాలు౼ఎనెన్నో  జ్ఞాపకాలు*..

*ఇలాంటి అనుభవాలు సంఘ నాయకులు అందరు అనుభవించారు...*

అప్పటి కాంట్రాక్టు మిత్రులకు కొండంత అండ దైవ సమానుడు ఆ  *రాజశేఖరుడు!!*

● *సైద్ధాంతిక విభేదాలతో పరస్పర ఆరోపణలతో సంఘాల సమన్వయంతో ఎకైక ఎజెండాతో అన్ని సంఘాల నాయకులు వారి వారి శైలిలో క్రమబద్దీకరణకు సహాయ సహకారాలు అందించిన అప్పటి అన్ని సంఘాల ప్రధాన  నాయకులకు అభినందలు.*

అప్పటి సంస్థ కార్యదర్సులు ముఖ్యముగా శ్రీ యెస్ కె సిన్హా గారు ,అధికారులు ,ఆఫీస్ సిబ్బంది సహాయం మరువలేనిది..

కాంట్రాక్టు ఉపాద్యాయుల సమస్య పై మంచి అవగాహన ఉన్న అప్పటి నాయకులలో నేను ముందు వరుసలో ఉంటాను...

● భాహ్యప్రపంచానికి   సమస్య తీవ్రతను తెలియచయడానికి పత్రికలు ఎంతో తోడ్పాటు అందించాయి..

● అందుకే నాయక వ్యాసాకర్తగా రూపాంతరం చెంది ఏందోరో సహకారంతో *24 వ్యాసాలను వివిధ పత్రికలకు  వ్రాయవలసి  వచ్చింది..*

మచ్చుకు కొన్ని నా వ్యాసాలు..వీటికి  డాక్టర్ రామ్మోహన్ , కీర్తి శేషులు రంగన్న మరియు రాజు(డాటా ఎంట్రీ ఆపరేటర్౼అచంపేట్) సహకారం మరువలేనిది..

★సంక్షేమ గురుకుల కాంట్రాక్టు ఉపాద్యాయుల వెతలు

★ గళం విప్పుతే ఉద్యోగాలకే ఎసరు

★ గురువులకు గుదిబండ౼ఏప్రిల్ 24

★కాంట్రాక్టు పేరిట టీచర్లతో వెట్టిచాకిరి

★ ఎప్పటికి మేము క్రమబద్దీకరణకు నోచుకుంటాం

★ఎన్నాళ్లీ యాతన

★తీరేనా మా భాధలు

★మా పిల్లలు స్థిర పడ్డారు౼మేము ఇంకా నిరోద్యుగులమే

★1152 మందికి కాంట్రాక్టు ఉపాద్యాయులకు రెజిలర్

★కాంట్రాక్టు ఉపాద్యాయుల కల సాకరమైన వేళా


పై వ్యాసలకు వారి వారి పత్రికలలో సముచిత స్థానాన్ని కల్పించిన ఎడిటర్లకు, సబ్ ఎడిటర్లకు ,పాత్రుకేయ మిత్రులకు ముఖ్యంగా శ్రీ సాయిబాబా(వార్త),                            శ్రీ వేదంతసూరి(వార్త) ,శ్రీ మల్లేశం(ఈనాడు),శ్రీ రామదాసు(వార్త),శ్రీరాములు,           శ్రీ ప్రభు(ఆంద్రభూమి),శ్రీ కట్టా శేఖర్ రెడ్డి, శ్రీ రాజు,శ్రీ కళ్యాణ చక్రవర్తి,శ్రీ కిషన్  మొదలగు మిత్రుల సహాకారముతో సాధ్యమైనది...

ఈ సమస్య సాధనకు కరపత్రాల ముద్రణకు,సమస్య సాధనకు  తోడ్పటు అందించిన నాయకులు డాక్టర్ మధు,శ్రీ రవీంద్రనాథ్,శ్రీ అర్జున మిత్రులు సహచర సంఘ సభ్యులు లచ్చన్న, సూర్యప్రకాష్,శ్రీమతి వెంకటమ్మ, శ్రీమతి జయంతి రాజ్యం,దానం,బాలరాజు,రంగస్వామి ,ముత్యంరెడ్డి,శౌరిరాజ్, బాలస్వామి,రమణ, ఉమామహేశ్వరప్పా,చంద్రశేఖర్, భద్రినాథ్ ,ప్రభాకర్  మరియు   మొదలగు వారిని గుర్తు చేసుకోవాలి..

● తపాలా బట్వాడాకు సహకరించిన  భిక్షపతి,ఈశ్వరయ్య ఇంకా ఎందరో..

చివరగా ఈ సమస్య సాధనకు అప్పటి కాంట్రాక్టు ఉపాధ్యాయులు ముఖ్యంగా చారి,బాలీశ్వర్, గణేశ్, గోపాల్,కిషోర్,చలం,ఈగ శ్రీనివాస్, లక్ష్మినారాయణ, ప్రభాకర్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు..

● ఇదే ప్రధాన సమస్య ఎప్పుడు తెరపైకి వచ్చిన వారి సమస్యే మా సమస్య అని భావించి తోడ్పటు అందించిన మిగతా ఉపాద్యాయులను మరవలేము..

ఇంకా ఎందరో మిత్రుల సహాకారముతో ఆ సమస్య సాధన జరిగింది.


ఇట్లు
మీ
డాక్టర్ రామ లక్ష్మణ్
SCIENCE VIDEOS

MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top